Mon Dec 23 2024 13:00:05 GMT+0000 (Coordinated Universal Time)
ఆ హీరోయిన్ కు నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలని ఉందట
తాజాగా నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఆయన గురించి ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నా సరే
నటి ప్రియా ఆనంద్.. లీడర్ సినిమా ద్వారా తెలుగు వాళ్లకు బాగా పరిచయం. ఆ తర్వాత ఆమె పలు భాషల్లో నటిస్తూ వెళుతోంది. అయితే కెరీర్ లో భారీ సక్సెస్ లను అందుకోలేకపోతోంది. సోషల్ మీడియాలో మరీ అంతగా యాక్టివ్గా ఉండదు ప్రియా ఆనంద్. కానీ స్వామి నిత్యానందకు సంబంధించిన వీడియోలను, పోస్టులను షేర్ చేయడం అభిమానులు గమనించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమెను దీని గురించి ప్రశ్నించగా, ఆమెకు నిత్యానంద అంటే ఇష్టమని.. పెళ్లి చేసుకోవాలనుందని చెప్పుకొచ్చింది. లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియా ఆనంద్.. ఆ సినిమా తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, 180 వంటి సినిమాల్లో నటించింది.
తాజాగా నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఆయన గురించి ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నా సరే ఆయనను ఇప్పటికీ వేలాదిమంది భక్తులు ఆదరిస్తున్నారని, ఆరాధిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఒకవేళ ఆయనను పెళ్లి చేసుకుంటే గనుక తన ఇంటి పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. ఆయన పేరు నిత్యానందా అయితే తన పేరు ప్రియానంద అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా అమ్మడి స్టేట్మెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
వరుడు కావలెను సినిమాతో దర్శకురాలిగా మారిన లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్ రూపొందింది. వెబ్ సిరీస్ లో సుశాంత్ కీలక పాత్ర పోషించగా అదే వెబ్ సిరీస్ లో ప్రియా ఆనంద్ కూడా ఒక కీలక పాత్రలో నటించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
తనను తాను భగవంతుడిగా ప్రకటించుకున్న నిత్యానంద స్వామి గతంలో ఆయన ఒక సినీనటితో జరిపిన రాసలీలలు వీడియోలు బయటకు వచ్చినప్పటి నుంచి బాగా ఫేమస్ అయ్యారు. అనేక కేసులలో ముద్దాయిగా ఉన్న నిత్యానంద దేశం దాటిపోవడమే గాక ఈక్వేడార్ దీవులలో ఒక దీవిని కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నాడు. ఆయన వీడియోలు, కామెంట్లు బాగానే వైరల్ అవుతూ ఉంటాయి.
Next Story