Thu Jan 09 2025 16:16:58 GMT+0000 (Coordinated Universal Time)
యూజర్లకు షాకిచ్చిన ibomma.. ఇకపై ఆ సినిమాలకే అనుమతి
ఇప్పటి వరకూ ibomma లో ఓటీటీలో విడుదలైన అన్ని సినిమాలు అందుబాటులో ఉండేవి. విడుదలై చాలాకాలం అయితే సెర్చ్ ఆప్షన్ లో..
ibomma తెలుగు సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని సినిమా వెబ్ సైట్ ఇది. కొత్తగా విడుదలయ్యే సినిమాలను హై క్వాలిటీలో ఫ్రీ గా చూసే అవకాశం ఇందులో ఉంది. గతంలో ఈ వెబ్ సైట్ ను రన్ చేయడం కష్టంగా ఉందని, వెబ్ సైట్ ను త్వరలోనే మూసివేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ.. ఏం జరిగిందో గానీ ఆ నిర్ణయంపై ibomma వెనక్కితగ్గింది. కానీ.. తాజాగా ibomma తీసుకున్న నిర్ణయం యూజర్లకు షాకిచ్చింది. ఇకపై కేవలం 30 సినిమాలను మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.
ఇప్పటి వరకూ ibomma లో ఓటీటీలో విడుదలైన అన్ని సినిమాలు అందుబాటులో ఉండేవి. విడుదలై చాలాకాలం అయితే సెర్చ్ ఆప్షన్ లో సినిమా లేదా వెబ్ సిరీస్ పేరు టైప్ చేస్తే ఆ సినిమాను చూపించేది. ఇకపై అలా చూడటం కుదరదట. ibomma తన వెబ్ సైట్ లో సెర్చ్ ఆప్షన్ ను డిసేబుల్ చేసింది. ఇకపై ఇండియన్ యూజర్లు తమ వెబ్ సైట్ లో చివరిగా అప్ లోడ్ చేసిన 30 సినిమాలు మాత్రమే చూసేందుకు వీలుంటుందని, అదికూడా తాత్కాలికమేనని ibomma తన వెబ్ సైట్ హోం పేజీలో ప్రకటించింది.
గతంలో వెబ్సైట్ మూసి వేయడానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్న సమయంలో వెబ్సైట్ నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయి కానీ మేము ప్యాషన్ తో ఈ పని చేస్తున్నాము అయినా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వ లేదు. మళ్లీ ibommaలో అన్ని సినిమాలను చూసే అవకాశం ఎప్పుడు కల్పిస్తుందో చెప్పలేదు.
Next Story