Wed Jan 08 2025 11:02:06 GMT+0000 (Coordinated Universal Time)
యూజర్లకు షాకిచ్చిన ఐ బొమ్మ.. ఇక ఫ్రీ క్వాలిటీ సినిమాలు లేనట్టే !
ఆన్లైన్ లో ఫ్రీ గా సినిమాలు, వెబ్ సిరీస్ లను చూపించడమే కాకుండా.. డౌన్లోడ్ ఆప్షన్ ను కూడా అందుబాటులోకి తెచ్చి.. యూజర్లను
అయిపోయింది.. అంతా అయిపోయింది. ఐ బొమ్మ అనుకున్నది అనుకున్నట్లు చేసేసి..ఇండియా యూజర్లకు ఊహించని షాకిచ్చింది. తన వెబ్ సైట్ ను షట్ డౌన్ చేసేసింది. ఇక ఫ్రీ గా .. క్వాలిటీతో అందుతున్న ఎంటర్టైన్ మెంట్ కు శుభం కార్డు వేసేసింది. తనను ఫాలో అవుతున్న సగటు సినీ అభిమానిని విపరీతంగా హర్ట్ అయ్యేలా చేసింది. ఓటీటీ బాదుడు నుంచి.. క్లాస్ట్లీగా మారిన కంటెంట్ నుంచి అందర్నీ తన వైపుకు మరల్చుకుంది ఐబొమ్మ. అన్ని ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న తెలుగు కంటెంట్ను ఒకే చోట చేర్చి.. యాడ్స్ లేకుండా సినిమాలను, వెబ్ సిరీస్ ను అందించింది.
ఆన్లైన్ లో ఫ్రీ గా సినిమాలు, వెబ్ సిరీస్ లను చూపించడమే కాకుండా.. డౌన్లోడ్ ఆప్షన్ ను కూడా అందుబాటులోకి తెచ్చి.. యూజర్లను ఇంప్రెస్ చేసింది. కానీ ఏం జరిగిందో గానీ.. కొద్దిరోజులుగా తన సర్వీసులను కొద్దికొద్దిగా తగ్గిస్తూ వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఐ బొమ్మ.. ఇకపై అన్ని సినిమాలను చూడటం కుదరదు. 30 సినిమాలను మాత్రమే అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. అలాగే వెబ్ సైట్ లో సెర్చింజన్ ను కూడా తొలగించింది. తమపై వస్తున్న ట్రోల్సే ఇందుకు కారణమని పేర్కొంటూ.. త్వరలోనే వెబ్ సైట్ ను షట్ డౌన్ చేస్తున్నట్లు ఓ నోట్ ను పెట్టి యూజర్లకు షాకిచ్చింది. తాజాగా దానినే నిజం చేసింది. అవును.. ఐ బొమ్మ తన వెబ్ సైట్ ను షట్ డౌన్ చేసి.. అందరినీ నిరాశపరిచింది.
Next Story