Thu Dec 19 2024 14:49:31 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : అనారోగ్యంతో అల్లు అర్జున్.. పుష్పకి బ్రేక్..
పుష్ప 2 షూటింగ్ లో అస్వస్థకు గురయ్యని అల్లు అర్జున్. ఇంతకీ బన్నీకి ఏం జరిగింది.
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'పుష్ప 2' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పుష్ప 1కి వచ్చిన హైప్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సెకండ్ పార్ట్ ని మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం జాతర సాంగ్ అండ్ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రీకరణ సమయంలో అల్లు అర్జున్ అస్వస్థకు గురయ్యారని సమాచారం. దీంతో పుష్ప 2 షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి. ఇంతకీ బన్నీకి ఏం జరిగింది.
ఈ జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ అమ్మోరు గెటప్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ గెటప్ తో డాన్స్ వేయడంతో పవర్ ఫుల్ ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్ చేయనున్నారు. మూవీలో ఈ సీక్వెన్స్ హైలైట్ కావడంతో.. అల్లు అర్జున్ గంటల తరబడి ప్రాక్టీస్ చేశారట. రెస్ట్ లేకుండా ప్రాక్టీస్, వెంటనే షూటింగ్ లో పాల్గొనడంతో అల్లు అర్జున్ కి తీవ్రమైన వెన్ను నొప్పి వచ్చిందట. ఇక డాక్టర్స్ రెస్ట్ అవసరం అని చెప్పడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.
మళ్ళీ డిసెంబర్ రెండో వారంలో ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారట. ఇక అల్లు అర్జున్ అస్వస్థ వార్త నెట్టింట వైరల్ అవ్వడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. రిలీజ్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నువ్వు ఆరోగ్యంగా ఉండు అన్న అంటూ నెట్టింట పోస్టులు వేస్తూ వస్తున్నారు. కాగా ఈ మూవీని 2024 ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్స్ ఫిక్స్ చేశారు. ఈ తేదీ లాంగ్ వీకెండ్ తో వస్తుంది.
పుష్ప 1కి వచ్చిన క్రేజ్ తో సెకండ్ పార్ట్ పై ఓ రేంజ్ హైప్ నెలకుంది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమాకి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీతో పాటు మరే పెద్ద సినిమా రిలీజ్ లేకుంటే మాత్రం.. పుష్ప 2 బాహుబలి రికార్డుని అందుకునే అవకాశం కూడా ఉందంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Next Story