Mon Dec 23 2024 09:48:06 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి అల్లు అర్జున్ అండగా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులకు భారీ సాయాన్ని ప్రకటించారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులకు భారీ సాయాన్ని ప్రకటించారు. ఇరవై ఐదు లక్షలు సీఎం సహాయనిధికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. వరదల కారణంగా ప్రజల కష్టాలను చూసి తన మనసు కలచి వేసిందని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
వరద బాధితులను....
ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకు వచ్చింది. నిన్ననే చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లు పాతిక లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ పది లక్షల విరాళాన్ని ప్రకటించింది.
Next Story