Tue Dec 24 2024 00:30:12 GMT+0000 (Coordinated Universal Time)
పూజా సెంటిమెంట్ రాధేశ్యామ్ కు వర్కవుట్ అవుతుందా ?
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో లక్కీ హీరోయిన్ ఎవరా అని అడిగితే.. ఠక్కున చెప్పేది పూజా హెగ్డే పేరే.
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో లక్కీ హీరోయిన్ ఎవరా అని అడిగితే.. ఠక్కున చెప్పేది పూజా హెగ్డే పేరే. ఈ ముంబై భామ లక్కు అలా ఉంది మరి. కెరీర్ మొదట్లో పూజా ఖాతాలో కొన్ని ఫ్లాపులు ఉన్నప్పటికీ.. గత రెండు మూడేళ్లుగా ఈ ముద్దుగుమ్మ భారీ హిట్లతో దూసుకుపోతోందనే చెప్పాలి. అరవింద సమేత, మహర్షి, అలవైకుంఠపురములో సినిమాలతో పాటు ఈ మధ్యే విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కూడా మంచి హిట్ సాధించింది.
లక్ సెంటిమెంట్ తో...
అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కాస్తా ఫ్లాప్ అవ్వడంతో.. ఆ తర్వాత వచ్చిన అలవైకుంఠపురములో అభిమానులను మెప్పిస్తుందో లేదోనన్న సందేహం ఉంది అందరిలో. సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో అంతా పూజా లక్ అన్నారు. ఆ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఇక అఖిల్ కు తన కెరియర్ లో మొదటి హిట్ పడింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తోనే. దీనిని బట్టి చూస్తే పూజా హెగ్డే ఉంటే చాలు.. సినిమాకు హిట్ ఖాయమన్న సెంటిమెంట్ కనిపిస్తోంది. మరి రాధేశ్యామ్ కు ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే 2022 సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.
Next Story