Mon Dec 23 2024 12:27:10 GMT+0000 (Coordinated Universal Time)
అప్పుడు పవన్ చెప్పిన మాటే.. ఇప్పుడు దళపతి విజయ్ కూడా..!
కట్ చేస్తే తమిళనాడులో కూడా ప్రస్తుతం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎదురైన పరిస్థితే అక్కడి టాప్ హీరో విజయ్ కు ఇప్పుడు ఎదురవుత
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలతో ప్రభుత్వం మీద మంచి దూకుడు మీద ఉన్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఎంతో వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన సినిమా కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉంది. అయితే ఒకప్పుడు రాజకీయాల్లోకి రావడానికి సినిమాలను వదిలేసిన సంగతి తెలిసిందే..! రాజకీయాల్లో పూర్తిగా టైమ్ కేటాయించాలంటే తప్పకుండా సినిమాలకు దూరం అవుతాయని అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పడం అభిమానులను ఎంతో బాధపెట్టింది. మెగా స్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ ను సినిమాలు చేయాల్సిందే అంటూ కోరారు. దీంతో పవన్ మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలను పూర్తీ చేసి.. వచ్చే ఏడాది ఎన్నికల్లో జనసేనానిని గెలిపించుకోడానికి ప్రయత్నించాలని అనుకుంటూ ఉన్నారు.
కట్ చేస్తే తమిళనాడులో కూడా ప్రస్తుతం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎదురైన పరిస్థితే అక్కడి టాప్ హీరో విజయ్ కు ఇప్పుడు ఎదురవుతూ ఉంది. విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుండో ప్రచారం సాగుతూ ఉంది. ఆయన కూడా ఒక కండిషన్ పెడుతూ ఉన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే సినిమాలకు పూర్తిగా దూరం అవుతానని అంటున్నాడు ఇళయదళపతి. ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేస్తున్నారు. కానీ ఆయన అభిమానులకు ఇది మింగుడు పడని విషయమే..! విజయ్ చెన్నై నగర శివారు ప్రాంతమైన పనైయూరులో ‘విజయ్ మక్కల్ ఇయ్యక్కం’కు చెందిన జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. తాజాగా తిరువళ్ళూరు, అరియలూరు, పెరంబలూరు, దిండిగల్, సేలం, తేని జిల్లాలకు చెందిన నిర్వాహకులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీ ముగిసిన బయటకు వచ్చిన మక్కల్ ఇయ్యక్కం సభ్యులు కీలక విషయాలను చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే సినిమాల్లో నటించడం మానేసి పూర్తిస్థాయిలో రాజకీయాలపైనే దృష్టి సారిస్తానని విజయ్ చెప్పారని అన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తాము చేశామన్నారు. త్వరలో విజయ్ పొలిటికల్ జర్నీ మొదలు కాబోతోందని తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.
Next Story