Mon Dec 23 2024 12:29:45 GMT+0000 (Coordinated Universal Time)
దళపతి విజయ్ సంచలన నిర్ణయం
స్టార్డమ్ ఉన్న నటులు పాలిటిక్స్ లోకి రావడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు, తెలుగు రాష్ట్రాలలో సినీ నటులు సీఎంలే అయ్యారు
స్టార్డమ్ ఉన్న నటులు పాలిటిక్స్ లోకి రావడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు, తెలుగు రాష్ట్రాలలో సినీ నటులు సీఎంలే అయ్యారు. ఏపీలో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ గా మంచి పోటీ ఇస్తున్నారు. ఇక తమిళనాడులో ఇళయ దళపతి విజయ్ కూడా రాజకీయాల్లో వస్తారని ఎన్నో సంవత్సరాలుగా చర్చ జరుగుతూనే ఉంది. కొద్దిరోజుల కిందట కొన్ని గంటల పాటూ విద్యార్థులను సత్కరించాడు విజయ్. ఆ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇక ఆయన పొలిటికల్ పార్టీ స్థాపించడమే తరువాయి అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ విజయ్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతూ ఉండగా.. తమిళనాడు పాలిటిక్స్ లో పొలిటికల్ హీట్ ను పెంచాయి.
అదేమిటంటే విజయ్ సినిమాల నుంచి కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని దళపతి విజయ్ భావిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 'లియో' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు విజయ్. 2024 ప్రథమార్థంలో సినిమాలు అన్ని పూర్తి చేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నాడు. తిరిగి 2027లోనే సినిమా చేయాలని విజయ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. తమిళనాడులో విజయ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజకీయ పార్టీలు ఆయన మద్దతు కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే విజయ్ ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. కేవలం పరోక్షంగా ఉంటూ ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే రేంజ్ లో తన అభిమానులను ప్రభావితం చేస్తూ ఉంటాడని టాక్ కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి వస్తే తమిళనాడు ఎన్నికల ముఖచిత్రమే మారిపోనుంది.
Next Story