Mon Dec 23 2024 02:28:00 GMT+0000 (Coordinated Universal Time)
పండంటి పిల్లాడికి జన్మనిచ్చిన ఇలియానా.. ఏ పేరంటే..?
ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచింది. తన ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్
గోవా బ్యూటీ ఇలియానా డి క్రూజ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఇలియానా. ఆమె ఆగస్టు 1న మగబిడ్డకు స్వాగతం పలికినట్లు తెలిపింది. పిల్లాడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టింది. తన నవజాత శిశువు మొదటి చిత్రాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. తమ పిల్లాడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించినందుకు ఎంతో సంతోషంగా ఉన్నామని తెలిపింది. ఎంతో సంతోషంగా ఉన్నామని .. చెప్పడానికి మాటలు లేవని తెలిపింది. ఈ శుభ సందర్భంలో మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయని ఇలియానా చెప్పుకొచ్చింది.
ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచింది. తన ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ సందర్భంగా ఆమె ఓ పెద్ద నోట్ కూడా రాసింది. తన జీవితంలో తాను మాతృత్వపు ఆనందాన్ని పొందుతానని అనుకోలేదని, ఇప్పుడా కల నెరవేరడంతో తానెంతో అదృష్టవంతురాలినని భావిస్తున్నట్లు చెప్పింది. ఇలియానా గతేడాది కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాము రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఇటు ఇలియానా కానీ, అటు సెబాస్టియన్ గానీ ఎప్పుడూ చెప్పలేదు.
Next Story