Mon Dec 23 2024 02:37:45 GMT+0000 (Coordinated Universal Time)
బేబీ బంప్ ఫొటోలు పోస్ట్ చేసిన ఇలియానా.. ఇప్పటికైనా తండ్రెవరో చెప్పంటున్న నెటిజన్లు
వాళ్లందరి అనుమానాలను తొలగిస్తూ.. తాజాగా ఇలియానా తన బేబీ బంప్ ఫొటోలను ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు..
గోవా బ్యూటీ, టాలీవుట్ నటి ఇలియానా గర్భవతి అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరినీ షాకయ్యేలా చేసింది. నటీమణులు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అవడం కొత్త కాదు.. కానీ ఇలియానా ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇందుకు ఆమె తల్లి కూడా సపోర్ట్ చేయడం కొసమెరుపు. అయితే తాను గర్భవతినని ఇలియానా చెప్పినపుడు నిజంగానే ప్రెగ్నెంట్ అయిందా ? లేక ఏదైనా మూవీ కోసం ఇలా పోస్ట్ చేసిందా ? అని సందేహాలు వ్యక్తం చేశారు.
వాళ్లందరి అనుమానాలను తొలగిస్తూ.. తాజాగా ఇలియానా తన బేబీ బంప్ ఫొటోలను ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ స్లీవ్ లెగ్ గౌన్ లో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఇలియానా ఏ సినిమా చేయడం లేదు. ఇంట్లోనే ఉంటూ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఇప్పటికైనా తండ్రెవరో చెప్పు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిడ్డపుట్టేలోపో, పుట్టాకనో ఆ సీక్రెట్ రివీల్ చేస్తుందేమో చూద్దాం.
Next Story