Sat Nov 23 2024 02:54:44 GMT+0000 (Coordinated Universal Time)
మరో నటుడిని కోల్పోయిన కన్నడ సినీ పరిశ్రమ
కన్నడ సినీ పరిశ్రమ. ప్రముఖ నటుడు శివరాం అనారోగ్యంతో కన్నుమూశారు.
కన్నడ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొన్నాయి. అక్కడ పవర్ స్టార్ గా పిలవబడే పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే మరణించగా.. ఆయన లేరన్న విషాదం నుంచి అభిమానులు, సినీ ప్రేమికులు ఇంకా కోలుకోలేదు. తాజాగా మరో నటుడిని కోల్పోయింది కన్నడ సినీ పరిశ్రమ. ప్రముఖ నటుడు శివరాం(83) అనారోగ్యంతో కన్నుమూశారు. గత మంగళవారం రాత్రి తన ఇంటిలో పూజా కార్యక్రమాలు చేస్తూ కుప్పకూలిన శివరాంను కుటుంబ సభ్యులు వెంటనే బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స తీసుకుంటున్న శివరాం.. బ్రెయిన్ హెమరేజ్‌తో గత రాత్రి తుదిశ్వాస విడిచారు.
అగ్రదర్శకుల వద్ద...
1938 జనవరి 28న జన్మించిన శివరాం 1958లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆయన సీని కెరీర్‌ను ప్రారంభించారు. కేఆర్ సీతారామ శాస్త్రి, పుట్టన్న కనగల్, సింగీతం శ్రీనివాసరావు వంటి అగ్ర దర్శకుల వద్ద పనిచేసిన ఆయన.. 1965లో బెరత జీవ అనే చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ నటుడిగా నటించి తన టాలెంట్ చూపారు. 1972లో హృదయ సంగమ అనే చిత్రంతో శివరాం దర్శకుడిగా మారారు.
రజనీతో సినిమాను...
కన్నడలో పలు సినిమాలు నిర్మించిన శివరాం.. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తమిళంలో ధర్మదురై అనే సినిమాను నిర్మించారు. 2010-11 ఏడాదికిగాను డాక్టర్.రాజ్‌కుమార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు శివరాం. అలాగే 2013లో పద్మభూషణ్ డాక్టర్ బి.సరోజిని జాతీయ అవార్డు ఈయనను వరించింది. శివరామ్ మృతిపట్ల కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సంతాపం వ్యక్తం చేశారు.
Next Story