Mon Dec 15 2025 06:23:44 GMT+0000 (Coordinated Universal Time)
మానసికంగా పెళ్లైపోయింది.. అతనే నా భర్త : అలియా భట్
మాయదారి వైరస్ తమ పెళ్లి ఆలోచనలు, పనులను పాడు చేసేసిందని తెలిపింది. తాజాగా.. మరోమారు తమ పెళ్లిపై స్పందించిన అలియా..

బాలీవుడ్ ప్రేమపక్షుల్లో ఈ జంట కూడా ఒకటి. ఈ సెలబ్రిటీ లవ్ బర్డ్స్ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నాయి. వాళ్లే రణబీర్ కపూర్, అలియా భట్. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. కానీ కరోనా కారణంగా తమ పెళ్లి వాయిదా పడిందని రణబీర్ చెప్పారు. 2020లో ఈ మహమ్మారి రాకపోయినట్లైతే.. తామిద్దరం పెళ్లితో ఒక్కటయ్యేవాళ్లమని పేర్కొన్నాడు.
ఈ విషయాన్ని అలియా కూడా అంగీకరించింది. మాయదారి వైరస్ తమ పెళ్లి ఆలోచనలు, పనులను పాడు చేసేసిందని తెలిపింది. తాజాగా.. మరోమారు తమ పెళ్లిపై స్పందించిన అలియా.. రణబీర్ తో మానసికంగా ఎప్పుడై పెళ్లైపోయిందని పేర్కొంది. ప్రస్తుతం తన మైండ్ లో ఆయనే తన భర్త అని చెప్పుకొచ్చింది. కాగా.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ చిత్రంలో అలియా రామ్ చరణ్ కు జోడీగా నటించింది. సీత క్యారెక్టర్ లో ఒదిగిపోయింది. ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.
Next Story

