RRR పై ఫైర్ అవుతున్నారే
ఈ మధ్యన సినిమాలు మొదలయ్యాయి.. అంటే ఆ సినిమా టైటిల్స్ కి గాని, ఆ సినిమా కథలకు గాని సంబంధం ఉందని అనిపించింది అంటే చాలు చాలా [more]
ఈ మధ్యన సినిమాలు మొదలయ్యాయి.. అంటే ఆ సినిమా టైటిల్స్ కి గాని, ఆ సినిమా కథలకు గాని సంబంధం ఉందని అనిపించింది అంటే చాలు చాలా [more]
ఈ మధ్యన సినిమాలు మొదలయ్యాయి.. అంటే ఆ సినిమా టైటిల్స్ కి గాని, ఆ సినిమా కథలకు గాని సంబంధం ఉందని అనిపించింది అంటే చాలు చాలా మంది కుల సంఘాలవారు తమ కులాన్ని కించపరుస్తున్నారని, అలాగే చాలామంది తమ కుల వ్యవస్థలను తెలుగు సినిమాలు వక్రీకరిస్తున్నాయి అంటూ ఆ సినిమాలు షూటింగ్ జరుపుకునేటప్పుడు, విడుదల సమయంలో నానా రచ్చ చేస్తున్నాయి. తాజాగా వాల్మీకి టైటిల్ మార్చాలని సినిమా విడుదల ముందు రోజు వరకు వాల్మీకి కులస్తులు చేసిన రచ్చ తో సినిమా టైటిల్ నే మార్చింది సినిమా యూనిట్. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న RRR సినిమా విషయంలో ఓ కాంట్రవర్సీ ఇప్పుడు తెగ హైలెట్ అవుతుంది.
వారు కలవలేదు….
చరణ్ అల్లూరి పాత్రలోనూ, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో తెరకెక్కుతున్న RRR పై అల్లూరి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు. RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు చరిత్రని వక్రీకరిస్తే ఊరుకోమని, సినిమాల పేరుతో అల్లూరి చరిత్రను మారుస్తామంటే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు వేర్వేరు చరిత్రలు కలిగి ఉన్నప్పటికీ ఒకానొక సమస్యతో వీరిద్దరూ కలిసి స్నేహం చెయ్యడమే కాకుండా ఆ సమస్య పరిష్కారానికి ఇద్దరు కలిసి పోరాడతారనే థీమ్ తో RRR సినిమా తెరకెక్కుతుంది అంటూ ఈ మధ్యన మీడియాలో వార్తలు రావడంతో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు ఆ విషయంపై స్పందిస్తూ చరిత్రలో వీరిద్దరికి స్నేహం ఉందని.. వీరు కలిసి పోరాటం చేశారని ఎక్కడా లేదని, అలాంటిది వీరిద్దరూ కలిసారని సినిమాలో ఎలా చూపిస్తారంటూ రాజమౌళి పై ఆయన ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయంపై రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి.