Sat Apr 05 2025 21:40:49 GMT+0000 (Coordinated Universal Time)
Tollywood : టాలీవుడ్ లో ఐటీ దాడులు .. అదే కారణమా?
టాలీవుడ్ లో ఆదాయపుపన్ను శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాతలు, దర్శకుల ఇళ్లలో సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి

టాలీవుడ్ లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాతలు, దర్శకుల ఇళ్లలో సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయని తెలిసి అనేక మంది చిత్రపరిశ్రమకు చెందిన వారు ఆందోళనకు గురవుతున్నారు. నిజానికి ఈ ఆదాయపు పన్ను శాఖ దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే కేవలం అనుమానం మీదనే అంటున్నాయి చిత్ర పరిశ్రమ వర్గాలు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీలను నిర్మిస్తున్నది టాలీవుడ్ మాత్రమే. అందులోనూ బాలివుడ్ ను మంచి టాలీవుడ్ లో అనేక సినిమాలు ఏటా నిర్మితమవుతున్నాయి. తెలుగులో పెట్టిన భారీ బడ్జెట్ మూవీలు మరే పరిశ్రమలో పెట్టడం లేదు.
వేల కోట్ల ఆదాయం వచ్చిన...
వందల కోట్లు పెట్టుబడులు పెట్టడం, వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చుకోవడం వంటివి టాలీవుడ్ లో జరుగుతుండటంతో వరసగా మూడు రోజుల పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరిపారు. సంక్రాంతికి విడుదలయిన సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్ మూవీల నిర్మాత దిల్ రాజు ఇళ్లు,కార్యాలయాల్ల సోదాలు జరిగాయి. అయితే ఇందులో గేమ్ ఛేంజర్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ లో బడ్జెట్ మూవీ అయినా ఐదు వందల కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. ఈ లెక్కలు బహిరంగంగానే నిర్మాతలు ప్రకటించారు. అయితే అందుకు తగినట్లుగా లెక్కలు చూపడంలో అవకతవకలున్నాయన్న అనుమానంతోనే ఐటీ శాఖ అధికారులు దాడులు చేసినట్లు చెబుతున్నారు.
ఊపు ఊపేసిన...
ఇక మరో సంచలన మూవీ పుష్ప 2 రిలీజ్ అయి ఇండియాలోనే ఒక ఊపు ఊపింది. మొత్తం 1800 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసిందని నిర్మాతలే బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఇందులో సినీ నిర్మాతల ఇళ్లతో పాటు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ సోదాలు రెండు రోజుల పాటు జరిగాయి. ఇందుకు కారణం ఆయనకు రెన్యుమరేషన్ తో పాటు పుష్ప 2 సినిమాలో పార్టనర్ షిప్ ఉందని తెలియడమే కారణమని అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిగే చోట ఖచ్చితంగా ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తుంది. సోదాలు నిర్వహిస్తుంది. పన్ను ఎగవేస్తే దానికి సంబంధించి మిగిలిన మొత్తాన్ని వసూలు చేసుకుంటుంది. అంతే తప్ప ఇందులో పెద్దగా భయపడాల్సిన పనిలేదని టాలీవుడ్ పెద్దలు చెబుతున్నారు. అయితే బయటకు మాత్రం ఐటీ దాడులు అంటేనే ఒకరకమైన షేక్ అవుతున్నారని,
దాడులపై రావిపూడి ఏమన్నారంటే?
ఐటీ శాఖ దాడులపై డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా తాజాగా స్పందించారు. ఇది తమకు ఆశ్చర్యం కలిగించలేదన్న ఆయన సర్వసాధారణంగా జరిగే సోదాలేనని ఆయన కొట్టిపారేశారు. ప్రతి రెండేళ్ల కొకసారి టాలీవుడ్, పారిశ్రామిక వేత్తలపై ఐటీ దాడులు జరగడం మామూలుగానే చూస్తున్నామని తెలిపారు.తమ డైరెక్టర్ ఇందులో ఎలాంటి భయాందోళనలు చెందడం లేదని, బిందాస్ గానే ఉన్నారని ఆయన తెలిపారు. తాము ఊహించని విధంగా మాత్రం ఈ దాడులు జరగడం లేదని ఆయన చెప్పడం చూస్తే టాలీవుడ్ ఇండ్రస్ట్రీ పెద్దలు ఐటీ దాడులను మామూలుగానే తీసుకుంటుున్నట్లు కనపడుతుంది. అందులో పెద్దగా షేక్ అవ్వాల్సిన ముందుగానే ఫిక్స్ అయినట్లు వారే చెబుతుండటం విశేషం.
Next Story