Mon Apr 14 2025 05:13:52 GMT+0000 (Coordinated Universal Time)
దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే అప్పగిస్తా.. సిండికేటు
పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.

దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే అప్పగిస్తా.. సిండికేటు ఈ పాటను యధాతధంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు అమలు చేస్తున్నట్లే కనిపిస్తుంది. పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో సుకుమార్ ఇంట్లో కూడా సోదాలను నిర్వహిస్తున్నారు. మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్ లో ఉన్న ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు..
పుష్ప మూవీ ఇప్పటికే 1800 కోట్ల కలెక్షన్ ఇండియా వైడ్ సాధించడంతో ఈ దాడులు జరుగుతున్నాయి. అధికారులు తనిఖీల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. టాలీవుడ్ ను ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు షేక్ చేస్తున్నాయి. సంక్రాంతి పండగకు, అంతకు ముందు విడుదలయిన చిత్రాల నిర్మాతల ఇళ్లలో ఈ సోదాలు జరుగుతుండటంతో టాలీవుడ్ లో నిర్మాతలు, దర్శకులు కూడా వణికిపోతున్నారు.
Next Story