Sun Dec 22 2024 21:12:06 GMT+0000 (Coordinated Universal Time)
Indian 2: భారతీయుడు-2 సినిమా విడుదల ఆపాలంటూ డిమాండ్
కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన 'ఇండియన్ 2' చిత్రం విడుదలకు
కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన 'ఇండియన్ 2' చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ చిత్రంపై నిషేధం విధించాలని కోరుతూ కేసు నమోదైంది. 'వర్మ కలై' [కేరళకు చెందిన మార్షల్ ఆర్ట్] ప్రధాన ఉపాధ్యాయుడు ఆసన్ రాజేంద్రన్ కమల్ హాసన్‌కు భారతీయుడు-1 సినిమా కోసం శిక్షణ ఇచ్చారని తెలిపారు. రెండో సినిమాలోనూ తన మెళకువలు ఉపయోగించారని.. అయితే అందుకు తన అనుమతి తీసుకోలేదని అన్నారు.
జూలై 9న మదురై జిల్లా కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. రాజేంద్రన్‌కు ప్రతిస్పందనను దాఖలు చేయడానికి 'ఇండియన్ 2' బృందం సమయం కోరడంతో న్యాయమూర్తి విచారణను జూలై 11కి వాయిదా వేశారు. మధురైలోని హెచ్ఎంఎస్ కాలనీలో ఆసన్ రాజేంద్రన్ మార్షల్ ఆర్ట్స్ టీచర్. 1996లో విడుదలైన 'ఇండియన్'లో కమల్‌హాసన్‌కు వర్మ కలై నేర్పినట్లుగా తనకు క్రెడిట్ ఇచ్చారని పిటిషన్ దాఖలు చేశాడు. కమల్ హాసన్‌కి తాను నేర్పిన టెక్నిక్లను ఈ సినిమా కోసం కూడా ఉపయోగించినందుకు సినిమాను థియేటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లలో నిషేధించాలని కోర్టును అభ్యర్థించారు.
'ఇండియన్ 2' జూలై 12న విడుదలకు సిద్ధమవుతోంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, SJ సూర్య, బాబీ సింహా.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Next Story