Sun Dec 22 2024 21:12:35 GMT+0000 (Coordinated Universal Time)
Bharateeyudu 2: భారతీయుడు-2 సెన్సార్ రిపోర్ట్ ఇదే!!
కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు-2 చిత్రం
కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు-2 చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. భారతీయుడు-2 మూవీ రన్ టైమ్ 180.04 నిమిషాలు. ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఎస్ జె సూర్య, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బ్రహ్మానందం తదితరులు నటించారు. భారతీయుడు-2 చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
భారతీయుడు 2 సినిమా విడుదల కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తునారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి వారంలో సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతించింది. అధిక డిమాండ్‌కు అనుగుణంగా అదనపు స్క్రీనింగ్ స్లాట్లను ప్రభుత్వం ఆమోదించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.75 పెంపునకు అనుమతించింది. ఈ సినిమా టిక్కెట్ ధరలను 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది.
Next Story