Mon Dec 23 2024 03:19:30 GMT+0000 (Coordinated Universal Time)
భారతీయుడు 2 షూటింగ్ పునః ప్రారంభం.. మరి చరణ్ సినిమా సంగతేంటి ?
భారతీయుడు 2 సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక డైరెక్టర్, నిర్మాతలతో గొడవలు, పలు కారణాలతో సినిమా ఆగిపోయింది.
డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. చరణ్ కు ఇది 15వ సినిమా. దిల్ రాజు నిర్మాతగా 50వ సినిమా. ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వని ఈ సినిమా.. వచ్చే వేసవికాలానికి విడుదల అవుతుందని కూడా ప్రకటించారు. కాగా.. భారతీయుడు 2 సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా ఆగిపోతుందన్న అనుమానాలు మొదలయ్యాయి. అనుకున్నట్లే జరిగింది. కమల్ హాసన్ – శంకర్ల కలయికలో వచ్చిన 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్గా భారతీయుడు 2 సినిమా షూటింగ్ మొదలైంది.
భారతీయుడు 2 సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక డైరెక్టర్, నిర్మాతలతో గొడవలు, పలు కారణాలతో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ మొదలైంది. తాజాగా నేడు భారతీయుడు 2 సినిమా పూజా కార్యక్రమం మరోసారి జరిగింది. భారతీయుడు 2 సినిమా పూజా కార్యక్రమం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ ఈ పూజలో కమల్ హాసన్ పాల్గొనలేదు. సెప్టెంబర్ 2 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నట్టు సమాచారం.
ఇండియన్ 2 సినిమా మొదలవుతుందని తెలియడంతో ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. RC15 సినిమా షూటింగ్ దశలో ఉండగా.. ఇండియన్ 2 సినిమా మొదలవ్వడంతో చరణ్ సినిమా ఆగిపోతుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇది ఎంతవరకూ నిజమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
Next Story