Sun Dec 22 2024 21:46:36 GMT+0000 (Coordinated Universal Time)
Game Changer : రామ్చరణ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్..
రామ్చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఎట్టకేలకు ఇక శంకర్..
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ డ్రామా 'గేమ్ ఛేంజర్'. 2021లో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. ఇండియన్ 2 వల్ల లేటు అవుతూ వచ్చింది. కమల్ హాసన్ తో శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2కి కొన్ని సమస్యలు ఎదురయ్యి షూటింగ్ ని నిలిపివేశారు. దీంతో శంకర్ ఆ మూవీని పక్కన పెట్టి గేమ్ చెంజర్ మొదలు పెట్టారు.
అయితే ఇంతలో ఇండియన్ 2 అడ్డంకులు తొలిగిపోవడంతో.. దానిని తెరకెక్కించాల్సిన అవసరం వచ్చింది. దీంతో కొన్ని రోజులు గేమ్ చెంజర్, కొన్ని రోజులు ఇండియన్ 2 తెరకెక్కించారు. అయితే ఇండియన్ 2 కథ చాలా పెద్దగా ఉండడంతో రెండు పార్టులుగా.. అంటే ఇండియన్ 3 కూడా తెరకెక్కించాలని భావించారు. దీంతో గేమ్ చెంజర్ షూటింగ్ మరింత లెట్ అయ్యింది. దీనివల్ల చరణ్ అభిమానులు విసిగి పోయారు.
ఇప్పుడు ఇండియన్ మూవీ షూటింగ్ గుమ్మడికాయ కొట్టేశారట. ఇక ఈ వార్త విన్న చరణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక శంకర్ 'గేమ్ చెంజర్' షూటింగ్ పై పూర్తి స్థాయి దృష్టి పెడతారని హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కాగా ఇటీవల నిర్మాత దిల్ రాజు గేమ్ చెంజర్ రిలీజ్ పై మాట్లాడుతూ.. 2024 సెప్టెంబర్ అని బదులిచ్చారు.
Next Story