Mon Dec 23 2024 06:35:29 GMT+0000 (Coordinated Universal Time)
Naveen Polishetty : నవీన్ పోలిశెట్టిపై భారత్ క్రికెటర్ ప్రశంసలు..
నవీన్ పోలిశెట్టిపై భారత్ క్రికెటర్ 'దినేష్ కార్తీక్' ప్రశంసలు వర్షం కురిపించాడు. ఎందుకో తెలుసా..?
Naveen Polishetty : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. వరుస హిట్స్ అందుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నాడు. రీసెంట్ గా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది సూపర్ హిట్టుని సొంతం చేసుకున్నాడు. తెలుగుతో పాటు సౌత్ లాంగ్వేజ్స్ తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలో ఈ భాషలతో పాటు హిందీలో కూడా స్ట్రీమ్ అవుతూ వస్తుంది.
ఇక నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ మూవీని ఇండియన్ క్రికెటర్ 'దినేష్ కార్తీక్' రీసెంట్ గా చూశాడు. సినిమా స్టోరీ, నవీన్ యాక్టింగ్ బాగా నచ్చడంతో.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్టు పెట్టాడు. ఇలాంటి రొమాన్స్ కామెడీ సినిమాలు తనకి బాగా నచ్చుతాయని పేర్కొన్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చాలా ఫన్నీగా ఉందని చెప్పుకొచ్చాడు. నవీన్ చాలా అద్భుతమైన స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాడని, తన కామెడీతో సినిమాని మరో స్థాయికి తీసుకు వెళ్లాడని పేర్కొన్నాడు.
ఇక దినేష్ కార్తీక్ పోస్టుకి రెస్పాండ్ అవుతూ నవీన్ థాంక్యూ చెబుతూ ఒక పోస్ట్ వేశాడు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలో నవీన్ పక్కన హీరోయిన్ గా అనుష్క శెట్టి నటించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ముఖ్యంగా అమెరికాలో ఈ మూవీకి చాలా ప్రేక్షాధారణ వచ్చింది.
కాగా నవీన్ ప్రస్తుతం 'అనగనగ ఒక రాజు' సినిమాలో నటిసున్నాడు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా 'మ్యాడ్' సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్.. ఈ సినిమాతోనే పరిచయం కావాల్సి ఉంది. షూటింగ్ కూడా మొదలు పెట్టిన తరువాత.. దానిని పక్కన పెట్టి.. అదే నిర్మాణ సంస్థలో 'మ్యాడ్' చిత్రం తెరకెక్కించాడు. ఇప్పుడు 'అనగనగ ఒక రాజు' సినిమాని మళ్ళీ పట్టాలు ఎక్కిస్తున్నారట.
Next Story