Mon Dec 23 2024 07:23:36 GMT+0000 (Coordinated Universal Time)
రవితేజ బర్త్ డే స్పెషల్.. "రావణాసుర" గ్లింప్స్ విడుదల
తాజాగా విడుదలైన గ్లింప్స్ ను చూస్తే.. 46 సెకండ్లతో ఉన్న వీడియో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అట్రాక్టివ్ గా ఉంది. రవితేజ..
క్రాక్ తర్వాత వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ ఇవ్వగా.. ధమాకాతో రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. గత డిసెంబర్ లో ధమాకా, ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడంతో.. రవితేజ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో ఉన్న మరో ప్రాజెక్ట్ "రావణాసుర". ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప ఇంతవరకూ ఎలాంటి అప్డేట్ లేదు. నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా.. "రావణాసుర" నుండి ఇంట్రస్టింగ్ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్.
స్వామిరారా సినిమా ఫేమ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్టీ టీమ్ వర్క్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై "రావణాసుర"ను సంయుక్తంగా నిర్మిస్తుండగా.. రవితేజ, అభిషేక్ నామా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా.. తాజాగా విడుదలైన గ్లింప్స్ ను చూస్తే.. 46 సెకండ్లతో ఉన్న వీడియో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అట్రాక్టివ్ గా ఉంది. రవితేజ ఈ సినిమాలో మరో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. హీరోయిన్లు మేఘా ఆకాశ్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజితా పొన్నాడలు నటిస్తున్నారు. హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తోన్న "రావణాసుర"ను ఈ ఏడాది ఏప్రిల్ 7న పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు.
Next Story