Sun Apr 06 2025 08:59:09 GMT+0000 (Coordinated Universal Time)
నాగ చైతన్య న్యూ లుక్ అదిరిపోలా
బంగార్రాజు సినిమా పై రోజుకో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఈరోజు నాగచైతన్యకు సంబంధించిన లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.

బంగార్రాజు సినిమా పై రోజుకో ఆసక్తికరమైన వార్తలు వెలువడుతున్నాయి. ఈరోజు నాగచైతన్యకు సంబంధించిన లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టిలు నటిస్తున్న ఈ సినిమా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. నవంబరు 23వ తేదీన నాగచైతన్య బర్త్ డే. ఆరోజు ఈ మూవీకి సంబంధించి టీజర్ ను విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.
టీజర్ కోసం....
నాగచైతన్య న్యూ లుక్ అదిరిపోయింది. పూల చొక్కా, నల్లకళ్లద్దాలతో నాగ చైతన్య కొత్తగా కన్పిస్తున్నారు. బంగార్రాజు మూవీ అక్కినేని ఫ్యామిలీ హిట్ లిస్ట్ లో చేరిపోతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ నెల 23వ తేదీ రిలీజ్ అయ్యే టీజర్ కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Next Story