Mon Dec 23 2024 07:54:31 GMT+0000 (Coordinated Universal Time)
"విజిల్ మహాలక్ష్మి"గా కృతి శెట్టి
తమిళ డైరెక్టర్ లింగుస్వామి - యంగ్ అండ్ ఎనర్జిటిక్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ది వారియర్.
మొదటి సినిమా "ఉప్పెన" తోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది కృతిశెట్టి. అందం, అభినయం, ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కుర్రకారును పిచ్చివాళ్లని చేస్తుంది. ఉప్పెనతో భారీ హిట్ కొట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతిశెట్టి చేతిలో.. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్ చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో నిలిచింది కృతిశెట్టి.
Also Read : ఎఫ్ 3 రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ డైరెక్టర్ లింగుస్వామి - యంగ్ అండ్ ఎనర్జిటిక్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ది వారియర్. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ది వారియర్ సినిమాలో కృతి లుక్, క్యారెక్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. కృతి శెట్టి జీన్స్, టీ షర్ట్ వేసుకుని కూల్గా స్కూటర్ నడుపుతూ కనిపించింది. విజిల్ మహాలక్ష్మిగా మీ అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు కృతి రెడీ అవుతుందంటూ రామ్ పోతినేని ట్వీట్ చేశారు. కాగా.. రామ్ మొదటిసారిగా పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో నటుడు ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ది వారియర్ చిత్రానికి.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Next Story