Tue Nov 05 2024 16:20:15 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త బాలీవుడ్ సినిమాలకు చుక్కలు చూపిస్తున్న కేజీఎఫ్-2
యష్ నటించిన KGF చాప్టర్ 2 థియేటర్లలోకి వచ్చి మూడు వారాలు అయ్యింది. ఈ చిత్రం ఇప్పటికీ భారీగా వసూళ్లు రాబడుతూనే..
ముంబై : బాలీవుడ్ లో కేజీఎఫ్-2 సినిమా ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం అజయ్ దేవగన్, అమితాబ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన.. 'రన్ వే 34' సినిమా విడుదలైంది.. ఇక యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ 'హీరోపంతి-2' కూడా థియేటర్ల లోకి వచ్చింది. అయితే ఈ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని స్పష్టమైంది. కేజీఎఫ్-2 ను చూడడానికే హిందీ జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
యష్ నటించిన KGF చాప్టర్ 2 థియేటర్లలోకి వచ్చి మూడు వారాలు అయ్యింది. ఈ చిత్రం ఇప్పటికీ భారీగా వసూళ్లు రాబడుతూనే ఉంది. గత వారం, అజయ్ దేవగన్ రన్‌వే 34 సినిమా.. KGF: చాప్టర్ 2కి గట్టి పోటీనిచ్చే లక్ష్యంతో థియేటర్లలో విడుదలైంది. అయితే, అజయ్ దేవగన్-నటించిన చిత్రం భారతదేశంలోని KGF: చాప్టర్ 2 రేంజ్ ను అందుకోలేకపోయింది. మే 1న, KGF: చాప్టర్ 2 కలెక్షన్, రన్‌వే 34 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కంటే ఎక్కువగా ఉంది. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ ప్రకారం, KGF: చాప్టర్ 2 నార్త్ బెల్ట్‌లో బాగా కలెక్షన్స్ ను రాబడుతూ ఉంది. కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్ మే 1న రూ.11.25 కోట్లు వసూలు చేయగా, అజయ్ దేవగన్ రన్ వే 34 రూ.7.25 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఈద్ హాలిడేస్ కారణంగా కేజీఎఫ్-2 మరింత కలెక్షన్స్ ను రాబట్టడం పక్కా అని అంటున్నారు.
టైగర్ ష్రాఫ్, తారా సుతారియా నటించిన హీరోపంతి 2 బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కనబరచడం లేదు. 3 రోజుల్లో 15 కోట్లు వసూలు మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా. KGF: చాప్టర్ 2 తుఫాను ఆధిపత్యం చెలాయిస్తోంది. యష్ నటించిన కేజీఎఫ్ మే 1న ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్క్‌ను దాటింది. హీరోపంతి 2 మంచి సమీక్షలను అందుకోలేదు. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను పొందింది. మొదటి రోజున టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రం కేవలం 7 కోట్ల రూపాయల కలెక్షన్స్‌కు తెరతీసింది. 3 రోజుల్లో ఈ చిత్రం 14 కోట్ల రూపాయలను వసూలు చేయగలిగింది. ఈ సినిమా భారీ బిజినెస్ చేస్తుందని అనుకున్నా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Next Story