Mon Dec 23 2024 11:47:38 GMT+0000 (Coordinated Universal Time)
మరో మల్టీస్టారర్ చేసేందుకు రవితేజ రెడీ .. ఆ హీరో ఎవరు ?
ఈ సినిమా రవితేజ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల ఊహకు కూడా అందని రీతిలో ఉండబోతోందని చెప్పి.. సినిమాపై అంచనాలు..
మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందెన్నడూ లేని ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రావణాసుర’. ఈ సినిమా వేసవిలో విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా రవితేజ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల ఊహకు కూడా అందని రీతిలో ఉండబోతోందని చెప్పి.. సినిమాపై అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. ఈ సినిమా తర్వాత ‘టైగర్ నాగేశ్వర్ రావు’ను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు రవితేజ. తాజాగా రవితేజ సినిమాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఇటీవల వాల్తేరు వీరయ్యలో రవితేజ చిరంజీవికి తమ్ముడిగా నటించగా.. ఈ మల్టీస్టారర్ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరో మల్టీస్టారర్ చేసేందుకు రవితేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఇటీవల రవితేజకు ఓ కథ చెప్పగా.. దానికి రవితేజ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇది మల్టీస్టారర్ సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాలో మరోహీరోగా శర్వానంద్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సందీప్ రాజ్ ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని టాక్ వినిపిస్తోంది. రవితేజ నిజంగానే మరో మల్టీస్టారర్ మూవీతో రాబోతున్నాడో లేదో త్వరలోనే తెలుస్తుంది.
Next Story