రోజా ఒప్పుకుంటుందా?
రోజా ఇప్పుడు అటు రాజకీయాలు, ఇటు ఈటివి స్పెషల్ ప్రోగ్రామ్స్, జబర్దస్త్ లతో యమా బిజీ. కరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్ నిలిచిపోవడంతో… రోజా గారు [more]
రోజా ఇప్పుడు అటు రాజకీయాలు, ఇటు ఈటివి స్పెషల్ ప్రోగ్రామ్స్, జబర్దస్త్ లతో యమా బిజీ. కరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్ నిలిచిపోవడంతో… రోజా గారు [more]
రోజా ఇప్పుడు అటు రాజకీయాలు, ఇటు ఈటివి స్పెషల్ ప్రోగ్రామ్స్, జబర్దస్త్ లతో యమా బిజీ. కరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్ నిలిచిపోవడంతో… రోజా గారు నగరిలోనే ఉంటూ అక్కడ కరోనా లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేస్తూ వైసిపిలో జగన్ తర్వాత నేనే అన్నంతగా హైలెట్ అవుతుంది. అయితే తాజాగా జబర్దస్త్ లో రోజాకి గడ్డుకాలమే అంటున్నారు. ఎందుకంటే గతంలో జబర్దస్త్ కి పనిచేసిన వాళ్లంతా రెండు చేతులా సంపాదిస్తున్నారు. జబర్దస్త్ లో పనిచేసే కమెడియన్స్, టెక్నీకల్ టీం ఇలా ఎవరికీ వారే పారితోషికాలతో కళకళలాడారు. ఇక రోజా రాజకీయాలతో యాక్టీవ్ అయినా.. జబర్దస్త్ ని వదల్లేదు. కారణం పారితోషికం, క్రేజ్. తాజాగా నాగబాబు బయటికెళ్ళిపోయినా.. రోజాని భారీ పారితోషికంతో జబర్దస్త్ నిర్వాహకులు కట్టిపడేసారు.
అయితే కరోనా తో షూటింగ్స్ వాయిదా పడి.. క్రేజ్ కోల్పోయిన జబర్దస్ మల్లి షూటింగ్ మొదలైనా మునుపటి వైభవం ఉండకపోవచ్చు అంటున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో అడ్వర్టయిజ్ మెంట్లలో భారీగా గండి పడే చాన్స్ ఉంది అంటున్నారు నిపుణులు. దానితో భారీ పారితోషికాలు అందుకుంటున్న ఆర్టిస్టులను కాస్త పారితోషకం తగ్గించుకోవాలని యాజమాన్యం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అలాగే జేడ్జ్ రోజాకి కూడా ఈమేరకు సూచనలు అందినట్లుగా.. ఆమె పారితోషికం లో కూడా కోత పడినట్లుగా టాక్. అయితే రాజకీయాలతో బిజీగా ఉండే రోజా గారు.. జబర్దస్త్ ని చేస్తున్నది ఫేమ్ కోసం, పారితోషికం కోసమే. మరి ఆ పారితోషికంలో కోత పడితే రోజగారు ఒప్పుకుంటారంటావా..