Mon Dec 23 2024 05:52:37 GMT+0000 (Coordinated Universal Time)
యువహీరోకి బ్రేకప్ చెప్పిన లైగర్ హీరోయిన్
మొదట సిద్ధాంత్ చతుర్వేది మాట్లాడుతూ.. తాను ఒంటరిగా ఉన్నానని, తనతో తిరుగుతూ ఇషాన్ కూడా ఒంటరివాడయ్యాడని..
బాలీవుడ్ నటి అనన్య పాండే ఇటీవల విడుదలైన లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది. తాజాగా ఈ అమ్మడు యువహీరో ఇషాన్ ఖట్టర్ కు బ్రేకప్ చెప్పిందట. ఈ విషయాన్ని ఇషాన్ ఖట్టర్ ఓ బుల్లితెర షో లో వెల్లడించాడు. అంతేకాదు.. అందుకు కారణం నువ్వేనంటూ కరణ్ జోహార్ ముఖం మీదే అనేశాడు. ప్రముఖ నిర్మాత, 'కాఫీ విత్ కరణ్' షో కి కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి 'కాఫీ విత్ కరణ్' షోకు హాజరైన ఇషాన్ ఈ విషయం వెల్లడించాడు. అనన్యతో విడిపోవడం గురించి ఇషాన్ను కరణ్ అడిగారు.
మొదట సిద్ధాంత్ చతుర్వేది మాట్లాడుతూ.. తాను ఒంటరిగా ఉన్నానని, తనతో తిరుగుతూ ఇషాన్ కూడా ఒంటరివాడయ్యాడని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత కరణ్.. ఇషాన్ రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అడిగాడు. 'నువ్వు ఈ మధ్యే అనన్యతో విడిపోయావు కదా?' అని ప్రశ్నించడంతో.. ఇషాన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. నేను కావాలని విడిపోలేదు.. మీ మాటలు విని అనన్యనే నాకు బ్రేకప్ చెప్పిందన్నాడు. గత ఎడిసోడ్ కు వచ్చిన అనన్యను కూడా కరణ్ ఇదే ప్రశ్నను అడిగాడు. ఇషాన్తో డేటింగ్ చేస్తున్నప్పుడు విజయ్ దేవరకొండతో డేట్ కి వెళ్లారా? అని అడగ్గా.. అలాంటిదేమీ లేదని అనన్య ఖండించిందని కరణ్ చెప్పారు.
ఇక కరణ్ ప్రశ్నలపై స్పందించేందుకు ఇషాన్ నిరాకరించాడు. ఎవరు ఎవరితో విడిపోయినా పర్వాలేదని, తాను చాలా ఒంటరిగా ఉన్నానని ఇషాన్ చివరకు ధ్రువీకరించాడు. ప్రస్తుతం అనన్యతో స్నేహంగా ఉన్నారా అని అడగ్గా.. 'నా జీవితాంతం ఆమెకు స్నేహితుడిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన వ్యక్తులలో ఆమె ఒకరు. ఆమె నాకు చాలా ప్రియమైన వ్యక్తి' అని పేర్కొన్నాడు ఇషాన్. కాగా ఇషాన్-అనన్య చాలా కాలం ప్రేమలో ఉన్నారు. కానీ ఈ విషయాన్ని వారు ఎక్కడా చెప్పలేదు. అలాగే తమ బ్రేకప్ ను కూడా ఎవరికీ చెప్పలేదు.
Next Story