Mon Dec 23 2024 16:36:13 GMT+0000 (Coordinated Universal Time)
సోదరిని కోల్పోయిన ఒక నటి.. ప్రాణంతో బయటపడ్డ మరో నటి.. ఇజ్రాయెల్ యుద్ధం
ఇజ్రాయెల్ యుద్ధంతో ఒక బాలీవుడ్ నటి సోదరిని కోల్పోతే.. మరో నటి ప్రాణాలతో బయటపడింది.
పాలస్తీనా, ఇజ్రాయిల్ యుద్ధం దారుణ మారణకాండగా మారి ప్రతి ఒక్కర్ని భయపెడుతుంది, బాధిస్తుంది. పాలస్తీనాకు చెందిన హమాస్ టెర్రరిస్ట్ లు ఇజ్రాయిల్ పౌరుల పై అకృత్యాలకు పాల్పడుతూ కిరాతకంగా చంపేస్తున్నారు. కాగా ఈ యుద్ధంలో ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా చిక్కుకుపోయారు. వారి పరిస్థితి అయితే దయనీయంగా మారింది. చదువుకోవడం కోసం, సంపాదన కోసం, ఈవెంట్స్ కోసం వెళ్లిన కొందరు ఇండియన్స్ ఆ యుద్ధంలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
ఈక్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు బాలీవుడ్ నటి 'నుష్రత్ భరూచా' ఇజ్రాయిల్ వెళ్ళింది. యుద్ధం మొదలవ్వడంతో అక్కడే ఒక హోటల్ చిక్కుకుపోయింది. ఒక సమయంలో ఆమె నుంచి కాంటాక్ట్ కూడా మిస్ అయ్యింది. దీంతో ఆమె ఏం అయ్యిందని కుటుంబసభ్యులు, అభిమానులు కంగారు పడ్డారు. అయితే వెంటనే అక్కడ భారత రాయభారి అధికారులు రంగంలోకి దిగి.. ఆమెను కనిపెట్టి సురక్షితంగా భారత్ పంపించారు.
అక్కడ నుంచి వచ్చిన నుష్రత్ భరూచా.. అక్కడి పరిస్థితులు గురించి తెలియజేస్తూ ఒక పోస్ట్ వేసింది. 36 గంటలు ఇజ్రాయిల్ లోని ఓ హోటల్ లో ప్రత్యక్ష నరకం చూసినట్లు చెప్పుకొచ్చింది. "బాంబుల శబ్దాల మధ్య భయాందోళన సమయం గడిపి, ఇప్పుడు ఇంటికి వచ్చిన తరువాత నాకు అర్ధమవుతుంది.. నేను ఎంత సురక్షితమైన దేశంలో ఉంటున్నానో" అని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
ఇక మరో బాలీవుడ్ నటి 'మధురా నాయక్'.. ఈ యుద్ధంతో తన సోదరిని పోగుట్టుకున్నట్లు తెలియజేసింది. ఈమె బంధువులంతా ఇజ్రాయిల్ లోనే బ్రతుకుతున్నారు. వారందర్ని ఇప్పుడు కొల్పుతూ వస్తున్నట్లు ఆమె పేర్కొంది. తన సోదరి, ఆమె భర్తని.. వాళ్ళ పిల్లల ముందే ఉగ్రవాదులు చంపేసినట్లు ఆమె తెలియజేసింది. ఈ సమయంలో ప్రజలందరూ ఇజ్రాయిల్ కోసం అండగా ఉండాలని, ప్రార్థనలు చేయాలని ఆమె వేడుకుంది.
Next Story