Tue Dec 24 2024 01:21:28 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ లో ప్రియాంక సింగ్ (పింకి) పారితోషికం ఎంతో తెలుసా ?
బిగ్ బాస్ హౌన్ నుంచి బయటకు వచ్చిన పింకీకి 13 వారాలకి గాను మొత్తం రూ.13 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ అందింది
ఆ హౌస్ లోకి వెళ్తే చాలు.. పెద్దగా ఫేమ్ లేని సెలబ్రిటీలకు కూడా ఎక్కడలేని క్రేజ్ వస్తుందని వారి నమ్మకం. కేవలం నమ్మకమే కాదు.. కొందరి జీవితాల్లో ఇదే నిజమైంది కూడా. తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకూ 4 సీజన్లు పూర్తి చేసుకుని, చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ప్రస్తుతం 5వ సీజన్ జరుగుతోంది. మరో రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే. విన్నర్ ఎవరు ? రన్నర్ ఎవరు ? తెలుసుకోవాలంటే అప్పటి వరకూ ఆగాల్సింది.
వారానికి కొంత...
ఇప్పటి వరకూ ఈ సీజన్ 13 వారాలు పూర్తి చేసుకోగా.. వారానికొకరుచొప్పున హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వస్తున్నారు. హౌస్ లో ఎన్ని రోజులుంటే.. రెమ్యునరేషన్ అంత ఎక్కువ వస్తుందని సీజన్ 1 నుంచి టాక్ ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేవారికి వారానికి ఇంత అని పారితోషికం ఉంటుంది. అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. సోషల్ మీడియాలో వారికున్న ఫాలోయింగ్, అప్పటి వరకూ ఉన్న వారి కెరీర్ ను బట్టి వారికి పారితోషికం ఇస్తారు బిగ్ బాస్ నిర్వాహకులు. తాజాగా 13వ వారం హౌస్ నుంచి బయటికి వచ్చింది ప్రియాంక సింగ్ (పింకి).
హౌస్ నుంచి...
పింకి జబర్దస్త్ చూసే వారికి తప్ప.. మిగతా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. పైగా ట్రాన్స్ జెండర్ కావడంతో హౌస్ లో రెండు, మూడు వారాలకన్నా ఎక్కువ ఉండలేదనుకున్నారు అంతా. కానీ.. తన కలివిడితనం, కేరింగ్, సత్ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంది పింకి. కేవలం తన మంచితనం కారణంగానే పింకి హౌస్ లో ఇన్నివారాలు ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు. హౌస్ నుంచి బయటికి వచ్చిన ఏ సెలబ్రిటీ అయినా వరుస ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు పింకి కూడా అలానే ఉంది. ఇంటర్వ్యూలు ఇస్తూ.. తనను తాను ప్రమోట్ చేసుకుంటోంది. తాజాగా ఆమెకు బిగ్ బాస్ నిర్వాహకులు ఇచ్చిన పారితోషికం వివరాలు బయటికొచ్చాయి.
పదమూడు లక్షలు....
పింకికి వారానికి లక్షకు పైగానే రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అంటే 13 వారాలకి గాను మొత్తం రూ.13 లక్షలకు పైగానే పింకి రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు అభిమానులతో పాటు.. మరో వైపు భారీమొత్తంలో డబ్బులు కూడా సంపాదించుకుంది ప్రియాంక సింగ్.
Next Story