Mon Dec 23 2024 12:47:25 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్కటవ్వనున్న కత్రినా - విక్కీ కౌశల్.. పెళ్లికి ఓటీటీ బంపర్ ఆఫర్
కత్రినా కైఫ్ కౌశల్ పెళ్లి స్ట్రీమింగ్ కోసం ఒక బడా మీడియా ఓటీటీ సంస్థ 100కోట్ల ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
సినీ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు అభిమానులు చాలా కుతూహలంగా ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ కు ఈ క్రేజ్ కాస్త ఎక్కవేనని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పెళ్లికి ముందు డేటింగ్ లు, తర్వాత నచ్చితే పెళ్లి, లేకపోతే బ్రేకప్.. ఇవే జరుగుతుంటాయి. వీరిలో స్టార్ కపుల్స్ కి ఉండే క్రేజే వేరు. డేటింగ్ అనంతరం స్టార్ కపుల్ పెళ్లి చేసుకుంటున్నారంటే.. ఫ్యాన్స్ కు అంతకుమించిన పండుగ ఉండదేమో అన్నట్లు ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధంగా ఉన్న ఆ స్టార్ కపుల్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారే కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్.
కొంతకాలంగా ప్రేమలో....
కొంతకాలంగా కత్రినా - విక్కీ కౌశల్ లు ప్రేమలో మునిగితేలుతున్నట్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఆఖరికి ఈ జంట పెళ్లికి సిద్ధమైంది. నిజానికి గతేడాదే వీరి పెళ్లి కావాల్సి ఉండగా.. కోవిడ్ పరిస్థితుల కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది. ఈ వారంలోనే ఈ స్టార్ కపుల్ ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే.. వీరి పెళ్లి వీడియో ప్రసార హక్కుల కోసం ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.100 కోట్లు ఓటీటీ ఆఫర్ చేసింది.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం కత్రినా కైఫ్ కౌశల్ పెళ్లి స్ట్రీమింగ్ కోసం ఒక బడా మీడియా ఓటీటీ సంస్థ 100కోట్ల ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ స్టార్ సెలబ్రెటీకి దక్కని రేంజ్ లో వీరికి బంపరాఫర్ ఇవ్వడం విశేషం. గతంలో కొంతమంది స్టార్ కపుల్స్ కూడా వారి పెళ్లిని బిజినెస్ డీల్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ.. ఇంత భారీ మొత్తంలో ఆఫర్ కొట్టేసిన మొదటి జంట మాత్రం కత్రీనా - విక్కీ కౌశల్ మాత్రమే.
రాయల్ ప్యాలెస్ లో....
రాజస్థాన్ లోని ఎంతో చారిత్రాత్మకమైన రాయల్ ప్యాలెస్ లో వివాహం జరగబోతోంది. పెళ్లికి ఏమాత్రం ఇబ్బందులు రాకుండా ప్యాలెస్ కు దగ్గరగా ఉన్న రోడ్లు కూడా బ్లాక్ చేయడం, వారం రోజులుగా ఆ పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే పెళ్లికి వచ్చే సెలబ్రిటీలకు కూడా కఠినమైన ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలోనే జరిగే ఈ పెళ్లి వేడుకలో.. ఎవ్వరూ మొబైల్స్ తీసుకురాకూడదన్న నిబంధన ఉన్నట్లు సమాచారం. తమ పెళ్లి ఫోటోలు, వీడియోలు ఎవరూ తీయకుండా, లీక్ అవ్వకుండా ఈ నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కత్రినా-విక్కీ కౌశల్ ల పెళ్లికి ఇంత క్రేజ్ ఉండటం ఎంత గొప్పో.. వారి పెళ్లికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం అంతకుమించి.. అనే చెప్పాలి.
Next Story