Mon Dec 23 2024 07:02:37 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లిపీటలెక్కనున్న సుడిగాలి సుధీర్ ?
బుల్లితెర యాంకర్, నటి అయిన రష్మీ - సుధీర్ ల మధ్య ప్రేమాయణం ఉందని చాలాకాలంగా రూమర్స్ ఉన్నాయి. ఇటీవలే తామిద్దరి మధ్య..
జబర్దస్త్ షో తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. కమెడియన్ గా సినిమాల్లో నటిస్తూనే.. టాలీవుడ్ హీరోగా ఎదిగాడు సుడిగాలి సుధీర్. బుల్లితెర యాంకర్, నటి అయిన రష్మీ - సుధీర్ ల మధ్య ప్రేమాయణం ఉందని చాలాకాలంగా రూమర్స్ ఉన్నాయి. ఇటీవలే తామిద్దరి మధ్య అలాంటిదేమీ లేదని, కేవలం స్నేహితులం మాత్రమేనని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇద్దరికీ మూడు పదుల వయసు దాటినా.. ఇంతవరకూ పెళ్లి టాపిక్ లేదు.
తాజాగా సుధీర్ పెళ్లి గురించి ఓ విషయం ప్రచారంలో ఉంది. త్వరలోనే సుధీర్ పెళ్లిచేసుకోబోతున్నాడనేది ఆ ప్రచారం వెనుకున్న విషయం. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకుంటున్నాడని చెపుతున్నారు. ఈ విషయం ఎంతవరకూ నిజమనేది తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం సుధీర్ పెళ్లి చేసుకుంటున్నాడన్న ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. ఇక ఇటీవల సుధీర్ నటించిన గాలోడు సినిమా విజయం సాధించడంతో.. హీరోగా సుధీర్ బిజీ అయ్యాడు.
Next Story