Mon Dec 23 2024 17:40:30 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లితో ఒక్కటైన జబర్దస్త్ ప్రేమజంట రాకేష్-సుజాత
టాలీవుడ్ లో ఇటీవల శర్వానంద్ తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లికూడా..
అటు టాలీవుడ్ లో, ఇటు బుల్లితెర లోనూ ఉన్న నటీనటులు దాదాపు ప్రేమ వివాహాలే చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో ఇటీవల శర్వానంద్ తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లికూడా జరగబోతోంది. ఇక బుల్లితెర విషయానికొస్తే.. లవ్ బర్డ్స్ గా ఉన్న జంటలన్నీ ఒక్కొక్కటిగా పెళ్లిపీటలెక్కుతున్నాయి. సీరియల్ నటులు అమర్ దీప్ -తేజు, కమెడియన్ యాదమరాజు - స్టెల్లా ఇటీవలే వివాహాలు చేసుకున్నారు.
ఇక జబర్దస్త్ లో ఎప్పటి నుండో ప్రేమపక్షులుగా ఫేమస్ అయిన జోర్దార్ సుజాత- రాకింగ్ రాకేష్ లు జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి యాంకర్ రవి, గెటప్ శీను, మంత్రి రోజా దంపతులు అతిథులుగా హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం రాకేష్ - సుజాత ల పెళ్లిఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story