ఎవరితో ఫోటో దిగాలనిపించలేదు.. కానీ వారితో మాత్రం...!
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా చక్రం తిప్పిన జగపతి బాబు ఇప్పుడు విలన్ గా చక్రం తిప్పుతున్నాడు. తన హీరో కెరీర్ 2010లో ముగిసిపోతే 2012లో బాలకృష్ణ లెజెండ్ ద్వారా మళ్లీ విలన్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన లెజెండ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సామెతలలో విలన్ గా హీరోతో సమానంగా పాత్రల్లో మెప్పించాడు. అరవింద సామెతలో బసిరెడ్డిగా తన విలనిజాన్ని ఇంతకన్నా ఎక్కువగా ఎవరూ చూపించరని దానికి కారణమైన త్రివిక్రమ్ కి థాంక్స్ చెప్పిన జగ్గు భాయ్.. ఎన్టీఆర్, బాలకృష్ణలతో తనకున్న అనుబంధాన్ని నందమూరి అభిమానులతో పంచుకున్నాడు.
బాలయ్య గురించి తారక్ మాటలు..
బాలకృష్ణ, తారక్ లలో ఒకే లక్షణాన్ని తాను చూశానని... తన విలన్ క్యారెక్టర్ బలంగా ఉండాలని బాలయ్య అప్పుడు డైరెక్టర్ పై ఒత్తిడి చేశారని... అదే పనిని తారక్ అరవింద సమేత సినిమాలో కూడా చేశాడని చెప్పిన జగపతి బాబు నాన్నకు ప్రేమతో సమయంలో తారక్ దగ్గర ఒక చిన్న డిస్కర్షన్ జరిగిందని.. బాలయ్యని, నిన్ను ఒకే ఫ్రెమ్ లో, ఒకే స్టేజ్ మీద చూడాలని ఉందని తారక్ తో చెప్పగా.. దానికి తారక్... తనకు తన బాబాయ్ మీద ప్రేమ, గౌరవం ఉన్నాయని, ఆయనంటే ఇష్టమని చెప్పాడని జగపతి బాబు చెప్పాడు.
ఎవరితో ఫోటో దిగను...
ఇంతవరకు తాను ఏ యాక్టర్ తోనూ ఫొటో దిగలేదని... కానీ బాలయ్య తో, ఎన్టీఆర్ తో కలిసి ఫోటో దిగాలని చాలా ఉందని.. అందుకే ఈ రోజు కావాలనే ఇద్దరితో కలసి ఫొటో దిగానని జగపతి బాబు చెప్పాడు. నందమూరి ఫ్యామిలీ చాలా గొప్పదని... వారి అభిమానులు గొప్పవారని చెప్పిన జగపతి బాబు నందమూరి అభిమానులకు అరవింద సమేత విజయం, బాలయ్య ఎన్టీఆర్ ల కలయిక దసరా, దీపావళిలను ఒకేసారి తెచ్చిపెట్టిందని చెప్పగానే నందమూరి అభిమానుల కోలాహలం మాములుగా లేదు.