సినిమా బాగోకపోయినా.. క్రేజ్ సూపర్ గా ఉంది
బాలీవుడ్ లో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎప్పుడెప్పుడు వెండితెర మీద చూస్తామా అని శ్రీదేవి అభిమానులు ఎదురు చూసారు. గత నాలుగైదేళ్లుగా జాన్వీ కపూర్ సినిమాల్లోకొస్తుంది అంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ... గత ఏడాది శ్రీదేవి ఆచి తూచి కరణ జోహార్ ప్రొడక్షన్స్ ద్వారా మరాఠీ లో సూపర్ హిట్ అయిన సైరత్ రీమేక్ సినిమాని ఇషాన్ ఖట్టర్ హీరోగా సెట్ చేసి జాన్వీ ని ఘనంగా హీరోయిన్ గా సినిమా తెరకు పరిచయం చేసింది. అయితే తన కూతురు ఎదుగుదలను కళ్లారా చూసుకోకుండానే శ్రీదేవి అందనంత ఎత్తుకు ఎగిరిపోయింది. ఇక తల్లి మరణం కుంగదీసినప్పటికీ... జాన్వీ కపూర్ తనకున్న కమిట్మెంట్ తో ధఢక్ సినిమాని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసింది.
అయితే భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని దర్శకుడు శశాంక్ ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని మలచలేకపోయాడు. మాతృకంలో హిట్ అయిన ఈ సినిమా బాలీవుడ్ లో ప్లాప్ అయినట్లే. సినిమాలో ఉన్న అనేక లోపల వలన సినిమా కి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. జాన్వీ కపూర్ ఇషాన్ ఖట్టర్ లు సినిమాకి కొత్తవాళ్లే కావడం.. వాళ్ళ లుక్స్ పరంగా బావున్నప్పటికీ... నటన లో తేలిపోయారని అంటున్నారు. జాన్వీ తన తల్లి మాదిరి స్టార్ డం సంపాదించాలంటే ఇంకా కష్టపడాలని అంటున్నారు. అయితే సినిమాకి ఎంతగా నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ... శ్రీదేవి కూతురు సినిమా ఎలా వున్నా చూడాల్సిందే అని అనుకున్నట్టుగా ఉంది ఆ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తుంటే.
దాదాకు సినిమా ని నిర్మాత కరణ్ జోహార్ మరి 'లో' బడ్జెట్ కాకుండా మీడియం బడ్జెట్ లో రిచ్ గా నిర్మించాడు. అయితే జాన్వీ కపూర్ క్రేజ్ తో సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినా... ఆయన పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు. అలాగే ధఢక్ మొదటి రోజు కలెక్షన్స్ 6 నుండి 7 కోట్లు వస్తాయనుకుంటే.. ధఢక్ మొదటి రోజే 9 కోట్లకు పైమాటే కలెక్షన్స్ కొల్లగొట్టింది. మరి జాన్వీ కపూర్ అందాలు, ఆమెకున్న క్రేజ్ కి ఇది నిదర్శనం. ఇక ఈ వారాంతంలో ధఢక్ సినిమాకి దాదాపుగా 30 కోట్లు కొల్లగొట్టేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి బాలీవుడ్ లో ప్లాప్ సినిమాతో జాన్వీ కపూర్ ఎంటర్ అయినప్పటికీ.. ఆమె ఫ్యూచర్ లో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు బాలీవుడ్ ప్రముఖులు