Mon Dec 23 2024 03:06:54 GMT+0000 (Coordinated Universal Time)
దుమ్మురేపుతున్న జై బాలయ్య యాంథమ్ సాంగ్
తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య మాస్ ఆంతం అని సాంగ్ ని విడుదల చేశారు. సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ని పొగుడుతూ జై బాలయ్య..
బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వీరసింహ రెడ్డి. బాలకృష్ణ 108వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తునారు. 2023 సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం.
తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య మాస్ ఆంతం అని సాంగ్ ని విడుదల చేశారు. సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ని పొగుడుతూ జై బాలయ్య.. జై జై బాలయ్య అని పూర్తి మాస్ బీట్ లో ఉంది ఈ సాంగ్. ఈ పాటతో బాలయ్య అభిమానులకే పూనకాలే. తమన్ సంగీత దర్శకత్వంలో కరీముల్లా పాడిన ఈ పాటను.. రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ లిరికల్ వీడియోలో తమనే ఎక్కువ కనిపించాడు. తమన్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో గోల్డ్ చైన్ ధరించి ఊర మాస్ స్టెప్పులు వేస్తూ, డప్పులు కొడుతూ హడావిడి చేశాడు.
Next Story