Sat Dec 21 2024 12:38:15 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిపురుష్ నుండి జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. వినేయండి..
కృతి సనన్ సీతగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు. ఓంరౌత్ దర్శకత్వం వచ్చిన..
ఇటీవల కాలంలో భారత్ లో సినీ ప్రియులు ఆదిపురుష్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. యాక్షన్, లవ్ సినిమాలకు భిన్నంగా.. ఈసారి రాముడి అవతారమెత్తాడు ప్రభాస్. కృతి సనన్ సీతగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు. ఓంరౌత్ దర్శకత్వం వచ్చిన ఆదిపురుష్.. సినిమా జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటి వరకూ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ లు వచ్చినా.. ఆడియన్స్ బాగా ఆకట్టుకున్నది మాత్రం జై శ్రీరామ్ పాట. బిట్ సాంగ్ కి బాగా కనెక్టైన ఆడియన్స్.. ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూశారు. నేడు ఆ పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది.
టీజర్ తో కాస్త నెగిటివీని మూటగట్టుకున్న చిత్ర టీమ్ కు ఈ పాట మంచి జోష్ ను ఇచ్చింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు అంతా సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో.. ఇప్పటి నుండి ప్రమోషన్లు షురూ చేస్తున్నారు. రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పిస్తుందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. అజయ్ అతుల్ సంగీతం అందించి, పాడిన జైశ్రీరామ్ పాటను మీరు ఓ సారి వినండి.
Next Story