Mon Dec 23 2024 18:23:22 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ అభిమానులూ.. సెప్టెంబర్ 2న జల్సా చేయడానికి సిద్ధమేనా..?
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే సెలెబ్రేషన్స్ మామూలుగా ఉంటాయా చెప్పండి.
స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే చాలు ఎక్కడ లేని హంగామా ఉంటుంది. కానీ ఈ మధ్య టాలీవుడ్ హీరోల సినిమాల రీరిలీజ్ లు సూపర్ గా హిట్ అవుతూ ఉన్నాయి. అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు వెళుతూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఒకప్పటి హిట్ సినిమాలకు మరిన్ని మెరుగులు దిద్ది రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజున పోకిరి సినిమాను రీరిలీజ్ చేశారు. ఈ సినిమాకు కనీసం టికెట్లు దొరకలేదు కొందరు అభిమానులకు..! ఇక ఒక్కడు సినిమాకు కూడా స్పెషల్ షోలను వేశారు. ఆ సినిమాను చూడడానికి కూడా అభిమానులు పోటెత్తారు. మహేష్ బాబు సినిమాను అప్పట్లో థియేటర్స్ లో చూడని వాళ్లు.. ఇప్పుడు బాగా ఎంజాయ్ చేశారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే సెలెబ్రేషన్స్ మామూలుగా ఉంటాయా చెప్పండి. అందుకే అభిమానుల కోసం జల్సా సినిమాను తీసుకుని వస్తున్నారు. ఒకప్పుడు వరుస ఫ్లాప్ లలో ఉన్న పవన్ కళ్యాణ్ కు జల్సా బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చింది. అలాంటి స్పెషల్ సినిమా 'జల్సా' ను రీరిలీజ్ చేస్తున్నారు. 'జల్సా' సినిమాపై దర్శకుడు సాయి రాజేష్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ''కొత్త ప్రింట్లో బాబు కొత్తగా కొన్న అద్దంలా మెరిసిపోతున్నాడు. సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంది. మీ సెలబ్రేషన్స్ మొదలు పెట్టండి'. షోలు, పబ్లిసిటీని సీనియర్ ఫ్యాన్స్ నిర్వహిస్తారు. ఇక నుంచి సంజయ్ సాహు రాక కోసం నేను ఎలాంటి బాధ్యత తీసుకోను' అంటూ చెప్పుకొచ్చాడు. అంటే పవన్ బర్త్ డే ని అభిమానులు జల్సా సినిమాతో ఎంజాయ్ చేయబోతున్నారు.
Next Story