Mon Dec 23 2024 18:38:55 GMT+0000 (Coordinated Universal Time)
పోకిరి రికార్డును చెరిపేసిన జల్సా.. ఇదేం క్రేజ్ సామీ
పవన్ పుట్టినరోజు సందర్భంగా నేడు జల్సా 4K వర్షన్ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ షో..
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా.. మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పోకిరి సినిమాను రీ రిలీజ్ చేశారు. 4K వర్షన్ లో సినిమాను రీ మాస్టర్ చేసి స్పెషల్ షో లు వేశారు అభిమానులు. ఈ స్పెషల్ షో లకు ఊహించినదానికన్నా ఎక్కువ రెస్పాన్స్ రావడంతో సూపర్ స్టార్ అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 380 షోలు వేశారు అభిమానులు. రీరిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో షో లు పడటం మామూలు విషయం కాదని కాలర్ ఎగరేశారు మహేష్ అభిమానులు. కానీ ఆ సంతోషం ఎక్కువరోజులు లేకుండా చేశారు పవన్ అభిమానులు.
పవన్ పుట్టినరోజు సందర్భంగా నేడు జల్సా 4K వర్షన్ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ షో లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఏకంగా 501 పైగా షో లు వేసేందుకు రెడీ అయ్యారు అభిమానులు. దీంతో ఈ సినిమాకు ఏ రేంజ్లో క్రేజ్ నెలకొందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు మరిన్ని స్పెషల్ షో లు యాడ్ అవుతాయని చెప్తున్నారు అభిమానులు. స్పెషల్ షో లతోనే పోకిరి రికార్డు లేపేసిన జల్సా.. రీ రిలీజ్ కలెక్షన్లలోనూ పోకిరి రికార్డులను తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Next Story