Wed Apr 02 2025 04:57:35 GMT+0000 (Coordinated Universal Time)
మరణించిన 'గాడ్ ఫాదర్' స్టార్
గాడ్ ఫాధర్.. హాలీవుడ్ లో వచ్చిన ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్.

గాడ్ ఫాధర్.. హాలీవుడ్ లో వచ్చిన ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ సినిమాను చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఈ సినిమాను చూసుకుని ఎన్నో సినిమా కథలు పుట్టుకొచ్చాయి. ఈ సినిమాలో 'సోనీ కార్లియోన్'గా నటించిన 'జేమ్స్ కాన్' మరణించాడు. ఆయన వయసు 82 సంవత్సరాలు. అతని మేనేజర్, మాట్ డెల్పియానో మాట్లాడుతూ బుధవారం, జూలై 6న జేమ్స్ కాన్ మరణించారని మీడియాతో పంచుకున్నారు. అతని కుటుంబం కాన్ మరణం విషయంలో గోప్యత కావాలని అభ్యర్థించింది. ప్రస్తుతానికి వారు జేమ్స్ కాన్ గురించి వివరాలను పంచుకోవడానికి ఇష్టపడడం లేదు.
APNews.comలోని ఒక నివేదిక ప్రకారం.. లెజెండరీ డైరెక్టర్ అల్ పాచినో జేమ్స్ కాన్ మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. "జిమ్మీ నా సోదరుడితో సమానం.. నా జీవితకాల స్నేహితుడు. గొప్ప నటుడు.. స్నేహితుడిని కోల్పోయాను." అని చెప్పుకొచ్చారు. "జిమ్మీ మరణం గురించి వినడానికి చాలా బాధగా ఉంది." అని రాబర్ట్ డి నీరో తెలిపారు. నాలుగు సార్లు వివాహం- విడాకులు తీసుకున్న కాన్కు తారా అనే కుమార్తె.. స్కాట్, అలెగ్జాండర్, జేమ్స్, జాకబ్ అనే కుమారులు ఉన్నారు.
News Summary - James Caan, the Godfather star, dies at 82
Next Story