Sun Nov 24 2024 02:00:08 GMT+0000 (Coordinated Universal Time)
32 ఏళ్ల తర్వాత తెరచుకున్న థియేటర్లు
అందులో 520 సీట్ల సామర్థ్యం కలిగిన మూడు స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కాగా.. 1990లో జమ్మూ అండ్ కశ్మీర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదం..
కరోనా తర్వాత దేశ వ్యాప్తంగా సినిమా హాళ్లు మూతపడిన విషయం తెలిసిందే. ఇటీవలే మళ్లీ సినిమా థియేటర్లు మామూలు స్థితికి వస్తున్నాయి. కానీ.. మన దేశంలోని ఓ ప్రాంతంలో 32 ఏళ్లుగా థియేటర్లు మూతపడే ఉన్నాయి. తాజాగా అక్కడ థియేటర్లు తెరచుకున్నాయి. థియేటర్లు మూతపడటానికి ఏ వైరస్ కారణం కాదు.. ఉగ్రవాదమే కారణం. మీరు అనుకుంటున్నది నిజమే. కశ్మీర్ లో 32 ఏళ్ల తర్వాత సినిమా థియేటర్లు తెరచుకున్నాయి. ఫుల్వామా, షోపియాన్ జిల్లాల్లో జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మల్టీపర్సస్ సినిమా హాళ్లను ప్రారంభించారు. ఇదొక చారిత్రాత్మక ఘటన అని ఆయన అన్నారు.
వచ్చేవారం కశ్మీర్లో తొలి ఐమాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. శ్రీనగర్‌లోని సోమ్ వార్ ప్రాంతంలో ఈ ఐమాక్స్ ను నిర్మించారు. అందులో 520 సీట్ల సామర్థ్యం కలిగిన మూడు స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కాగా.. 1990లో జమ్మూ అండ్ కశ్మీర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రారంభమయ్యే ముందు.. లోయలో శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా, సోపోర్, హంద్వారా, కుప్వారాలో 19సినిమా హాళ్లు ఉన్నాయి. ఉగ్రవాదుల బెదిరింపుల కారణంగా అవన్నీ మూతపడి శిథిలావస్థకు చేరుకున్నాయి. 1999లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం రీగల్, నీలం, బ్రాడ్వే సినిమాలను చిత్రీకరించడానికి అనుమతించడం ద్వారా సినిమా థియేటర్లను పునరుద్ధరించే ప్రయత్నిం జరిగింది.
రిగాల్ సినిమా థియేటర్లో తొలి షో వేసిన సమయంలో ఉగ్రవాదులు దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. హాల్ పై మూడు గ్రనేడ్ లతో దాడి చేయడంతో.. మరోసారి థియేటర్లకు తాళాలు వేయక తప్పలేదు. జమ్మూ కశ్మీర్ ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రోత్సాహంతో మళ్లీ అక్కడి థియేటర్లు తెరచుకున్నాయి. త్వరలో అనంత్ నాగ్, శ్రీనగర్, బందిపోరా, గందర్ బల్, దోడా, రాజౌరి, పూంచ్, కిష్ట్యార్, రియాసీలలో త్వరలో థియేటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
Next Story