Mon Dec 23 2024 16:06:11 GMT+0000 (Coordinated Universal Time)
ఎట్టకేలకు ‘దేవర’ షూటింగ్ గురించి మాట్లాడిన జాన్వీ..
దేవర షూటింగ్ సెట్స్ లోకి ఇప్పుడు వరకు అడుగుపెట్టని జాన్వీ కపూర్.. ఎట్టకేలకు ఆ మూవీ గురించి మాట్లాడింది.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'దేవర'. ఈ సినిమాని కూడా రెండు పార్టులుగా తీసుకు వస్తున్నామంటూ ప్రకటించి సినిమా పై అంచనాలు మరింత పెంచేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి యాక్షన్ సీక్వెన్స్ నే చిత్రీకరిస్తూ వచ్చారు. ఈక్రమంలోనే మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ పార్ట్ అంతా పూర్తి చేసేశారట.
ఇక ఇప్పుడు ఎమోషన్, లవ్ మరియు ఇతర సన్నివేశాలు అన్ని చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అందరికంటే ముందుగా ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ నే రిలీజ్ చేశారు. కానీ ఇప్పటివరకు జాన్వీ మాత్రం ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టలేదు. ఎట్టకేలకు రీసెంట్ గా ఈ భామ దేవర షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని జాన్వీ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
దేవర షూటింగ్ ప్రస్తుతం గోవా, గోకర్ణలో జరుగుతుంది. నవంబర్ 7 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. ఇక ఈ షెడ్యూల్ లో జాన్వీ కపూర్ పై ఇంపార్టెంట్ సీన్స్ చిత్రీకరణ ప్లాన్ చేశారు. షూటింగ్ లో పాల్గొన్న జాన్వీ తన టాకీ పార్ట్ పూర్తి చేసేసి ఇంటికి వచ్చేసింది. ఈ విషయం తెలియజేస్తూ తన ఇన్స్టాలో స్టోరీ పెట్టింది. షూటింగ్ నుంచి జాన్వీ రిటర్న్ అవుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సైఫ్ అలీఖాన్ మెయిన్ విలన్ నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కూడా నెగటివ్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కిలినేని సుధాకర్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మొదటి పార్ట్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నారు.
Next Story