Fri Dec 27 2024 10:41:39 GMT+0000 (Coordinated Universal Time)
JANUARY 9 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి కానీ.. ఉపయోగకరమైనవే ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, సోమవారం
తిథి : బ.విదియ ఉ.9.39 వరకు
నక్షత్రం : ఆశ్లేష పూర్తిగా..
వర్జ్యం : రా.8.27 నుండి 10.15 వరకు
దుర్ముహూర్తం : మ.12.37 నుండి 1.21 వరకు, మ.2.50 నుండి 3.34 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : సా.4.00 నుండి 4.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రిజిస్ట్రేషన్ల ఆఫీసుల్లో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ రుణప్రయత్నాలు మరింత గట్టిగా చేయాల్సి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి కానీ.. ఉపయోగకరమైనవే ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు, వివాదాస్పదమైన అంశాలకు ఎంతదూరంగా ఉంటే.. అంతమంచిది. మంచికిపోయినా చెడు ఎదురైన చందంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. పూర్తికావనుకున్న పనులు ముందుకు సాగుతాయి. అంచనాల మేరకు రోజంతా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమపడితే తప్ప పనులు పూర్తయ్యే అవకాశం లేదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొనుగోళ్లు, అమ్మకాల విషయాల్లో నష్టపోవడానికి, మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంక్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వీలైనంత వరకూ ఎవరినీ నమ్మకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి బయట పడతారు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. మానసిక ఒత్తిడులను అధిగమిస్తారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. పార్ట్ టైం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దంపతుల మధ్య మాత్రం అన్యోన్యత తగ్గుతుంది. ఇంట పట్టునే ఉండేందుకు ఇష్టపడరు. పనులు వేగాన్ని పుంజుకుంటాయి. రోజంతా హుషారుగా గడుస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార పరంగా ఒత్తిడులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు వాయిదా పడొచ్చు. పనుల్లో గందరగోళం నెలకొంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. అపార్థాలు రాజ్యమేలుతాయి. ఉద్యోగ, వ్యాపారపరంగా సర్దుకుపోయే ధోరణి ఉండటం మంచిది ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. క్రయవిక్రయాలపై దృష్టి సారిస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలు తొలగిపోతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తగా ముందుకెళ్లాలి. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రిజిస్ట్రేషన్లు సజావుగా కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చిట్టిపొట్టి తగాదాలు తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రుణాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వస్తువులను తాకట్లు పెట్టకపోవడం మంచిది. అన్ని వయసుల వారు ఈ రోజు రిస్క్ కు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఎరుపు రంగు.
Next Story