Sun Dec 22 2024 23:27:38 GMT+0000 (Coordinated Universal Time)
పాపం షారుఖ్ ఖాన్.. ఈ లీకుల దెబ్బ ఏమిటో?
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం ‘జవాన్’ ను లీకులు వదలడం లేదు
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం ‘జవాన్’ ను లీకులు వదలడం లేదు. ఇంతకు ముందు షూటింగ్ సమయంలో క్లిప్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇంకొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్స్ ను దొంగిలించారని.. వాటిని ఆన్లైన్లో లీక్ చేశారని అంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ కాపీరైట్ ఉల్లంఘన గురించి శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక ప్రకారం, ఆగస్టు 10న, ఐటీ చట్టం కింద, ముంబైలోని శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్లో షారుఖ్ కంపెనీ రెడ్ చిల్లీస్ తరపున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జవాన్ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. కానీ ఈ సినిమా వీడియో క్లిప్స్ లీక్ అవుతూ ఉండడంతో మూవీ యూనిట్ ఆందోళన చెందుతోంది. ‘జవాన్’ నుంచి వీడియోలు లీక్ కావడం ఇది రెండోసారి. ఏప్రిల్‌లో వీడియోస్ లీక్ అయినప్పుడే ఢిల్లీ హైకోర్టు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, కేబుల్ టీవీ అవులెట్స్, షేడీ వెబ్‌సైట్స్‌కు ఆ క్లిప్స్ ను తీసివేయాలని హెచ్చరికలు జారీ చేసింది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రదీప్ నిమాని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. FIR ప్రకారం, ఇటీవల ప్రొడక్షన్ హౌస్ కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా సినిమా వీడియో క్లిప్‌లు ఆన్లైన్లో లీక్ అయినట్లు కనుగొంది. సినిమాను ఇంకా థియేటర్లలో విడుదల చేయలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
Next Story