Sat Dec 28 2024 10:18:31 GMT+0000 (Coordinated Universal Time)
జయ బచ్చన్ బోల్డ్ స్టేట్మెంట్స్.. మనవరాలు పెళ్లి కాకుండా తల్లైనా ఇబ్బంది లేదట
రిలేషన్ షిప్ ఎక్కువ కాలం కొనసాగాలంటే 'శారీరక ఆకర్షణ' చాలా ముఖ్యమని ప్రముఖ నటి జయ బచ్చన్ అన్నారు. ఆమె మనవరాలు నవ్య నవేలి నందతో కలిసి 'వాట్ ది హెల్ నవ్య' అనే పోడ్కాస్ట్లో మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది. నవ్య నవేలి నందకు పెళ్లి కాకుండా బిడ్డకు జన్మనిచ్చినా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్పింది.
ప్రజలు నా నుండి ఇలాంటి కామెంట్లు రావడాన్ని అభ్యంతరకరంగా భావిస్తారు.. కానీ శారీరక ఆకర్షణ చాలా ముఖ్యమైనదని అన్నారు జయ. మా కాలంలో మేము ప్రయోగాలు చేయలేకపోయాము.. కానీ నేటి తరం వారు ఎందుకు చేయకూడదు? అని ప్రశ్నించారు. శారీరక సంబంధం లేకుంటే ప్రేమ-బంధం అనేవి చాలా కాలం కొనసాగవు. అడ్జెస్ట్మెంట్స్ చేసుకుంటూనే జీవితాంతం బతకలేరని నేను భావిస్తున్నానని అన్నారు జయ బచ్చన్. ఇప్పటి జెనరేషన్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ను పెళ్లి చేసుకుంటే చాలా బెటర్ అని కూడా జయ బచ్చన్ సలహాలు ఇచ్చారు. బెస్ట్ ఫ్రెండ్ తో బిడ్డను కనడంలో కూడా తప్పులేదని అన్నారు. ఈ జెనరేషన్ పిల్లలు మీ బెస్ట్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదని జయ అన్నారు. జయ తన అభిప్రాయాన్ని నవ్యతోనూ, ఆమె కుమార్తె శ్వేతా బచ్చన్తో కూడా పంచుకున్నారు. జయ బచ్చన్ అమితాబ్ బచ్చన్ ను 1973లో వివాహం చేసుకుంది. కుమార్తె శ్వేత (1974), కొడుకు అభిషేక్ బచ్చన్ (1976) జన్మించారు. ఇక కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో జయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, అలియా భట్, ధర్మేంద్ర, షబానా అజ్మీ కూడా నటించారు. ఈ సినిమా 2023లో విడుదల కానుంది.
Next Story