Fri Dec 27 2024 02:23:07 GMT+0000 (Coordinated Universal Time)
Jayam Ravi wife Aarti: మౌనం వీడిన స్టార్ హీరో భార్య.. బాంబు పేల్చింది!
తమిళ నటుడు జయం రవి ఇటీవల తన భార్య ఆర్తితో
తమిళ నటుడు జయం రవి ఇటీవల తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జయం రవి భార్య ఆర్తి ఎట్టకేలకు ఈ విషయంపై మౌనం వీడారు. తమ విడాకుల గురించి రవి చేసిన ప్రకటనకు సంబంధించి ఆమె వివరణాత్మక ప్రకటనను పంచుకున్నారు. తనకు తెలియకుండా, సమ్మతి లేకుండా ఈ ప్రకటన చేశారని ఆమె పేర్కొన్నారు. రవితో తాను విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుండి తన క్యారెక్టర్ పై దాడులు చేస్తూ ఉండడంతోనే తాను మాట్లాడవలసి వచ్చిందని ఆర్తి తెలిపారు. తన ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ల గురించి మాత్రమే తన దృష్టి ఇప్పుడు ఉందని అన్నారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించానని, భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానన్నారు. అయితే, దురదృష్టవశాత్తు తనకు ఆ అవకాశం దక్కలేదన్నారు.
జయం రవి ప్రకటన చూసి తాను, పిల్లలు షాకయ్యామని ఆర్తి తెలిపారు. ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని, ఈ నిర్ణయం వల్ల తమకు ఏమాత్రం మంచి జరగదన్నారు. బాధ కలిగినా తాను గౌరవంగానే ఉండాలని అనుకుంటున్నానని, అందుకే బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఒక తల్లిగా తన తొలి ప్రాధాన్యం ఎప్పుడూ పిల్లల శ్రేయస్సేనన్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్నారు. జయం రవి, ఆర్తికి వివాహమై 15 ఏళ్లు దాటింది. వీరు 2009 జూన్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Next Story