Mon Dec 15 2025 06:38:11 GMT+0000 (Coordinated Universal Time)
సహజనటి జయసుధకు కరోనా
జయసుధ కు కరోనా సోకింది. ఆమెకు స్వల్ప లక్షణాలు కనపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. టాలీవుడ్ ను కరోనా షేక్ చేస్తుంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి రెండోసారి కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా జయసుధ కు కరో్నా సోకింది. ఆమెకు స్వల్ప లక్షణాలు కనపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షలలో జయసుధకు కరోనా పాజిటివ్ గా తేలింది.
హోం ఐసొలేషన్ లో...
ప్రస్తుతం జయసుధ హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఎవరూ భయాందోళనలు చెందాల్సిన పనిలేదని జయసుధ చెప్పారు. తనను వారం రోజుల నుంచి కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని జయసుధ సూచించారు.
Next Story

