Mon Dec 23 2024 15:32:59 GMT+0000 (Coordinated Universal Time)
క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో జేడీ రీ ఎంట్రీ.. ట్రైలర్ అదిరిందిగా !
ఈషా రెబ్బా, పృథ్వీ రాజ్, జోష్ రవి, కమల్ కామరాజు, రమ్య నంబీసన్, యాంకర్ విష్ణుప్రియ తదితరులు కీలక పాత్రధారులుగా..
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు ఏ మాత్రం తీసిపోవట్లేదు ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు. ముఖ్యంగా క్రైం థ్రిల్లింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఓటీటీల్లో విశేష ప్రేక్షక ఆదరణ దక్కుతోంది. ఓటీటీల్లో విడుదలయ్యే కంటెంట్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకునే.. స్టార్ హీరో, హీరోయిన్లు కూడా డిజిటల్ వైపు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వని సీనియర్ టాలీవుడ్ నటుడు జేడీ చక్రవర్తి.. ఇప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తో రాబోతున్నాడు. అదే "దయా".
ఈషా రెబ్బా, పృథ్వీ రాజ్, జోష్ రవి, కమల్ కామరాజు, రమ్య నంబీసన్, యాంకర్ విష్ణుప్రియ తదితరులు కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. అత్యాచార సీన్లతో మొదలైన ఈ ట్రైలర్ లో.. ఒక లేడీ రిపోర్టర్ మిస్సింగ్, వ్యాన్ డ్రైవర్ గా జేడీ ఎంట్రీ, పృథ్విరాజ్ చెప్పే డైలాగ్ లు చూస్తుంటే.. ఓటీటీ ప్రేక్షకులకు పక్కా థ్రిల్ ఎంటర్టైన్ మెంట్ ఇచ్చే వెబ్ సిరీస్ గా కనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 4వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది.
Next Story