Mon Dec 23 2024 10:04:22 GMT+0000 (Coordinated Universal Time)
నగరిలో జీవితా రాజశేఖర్.. ఎందుకు వచ్చారంటే..?
2017లో రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం గరుడవేగ.
ప్రముఖ సినీ నటి జీవితా రాజశేఖర్ గురువారం చిత్తూరు జిల్లా నగరి కోర్టుకు హాజరయ్యారు. తమకు రూ.26 కోట్లు బకాయి పడ్డారంటూ ఆమెపై ఇటీవల జోస్టర్ గ్రూప్ యాజమాన్యం ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ వద్ద అప్పు తీసుకున్న జీవిత రుణాన్ని తిరిగి చెల్లించలేదని ఆరోపించింది. జీవిత ఇచ్చిన చెక్‌ను బ్యాంకులో డిపాజిట్ చేయగా అది బౌన్స్ అయ్యిందని పేర్కొంది. ఈ వ్యవహారంపై గ్రూప్ యాజమాన్యం నగరి కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు జీవితా రాజశేఖర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గురువారం జరిగిన కోర్టు విచారణకు జీవిత స్వయంగా హాజరయ్యారు. తన న్యాయవాదులను వెంటబెట్టుకుని ఆమె కోర్టుకు వచ్చారు.
2017లో రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం గరుడవేగ. ఈ చిత్ర నిర్మాణంలో జీవితా రాజశేఖర్‌లతో పాటు జోస్టర్ సంస్థ కూడా భాగమైంది. ఈ సినిమా రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలవ్వడానికి కారణం అయింది. జోస్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హేమ చెక్ బౌన్స్ కేసులో నగరి కోర్టుని ఆశ్రయించారు. గతంలో జీవితా రాజశేఖర్ తమకు రూ.26 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఎగగొట్టారని, ఆమె ఇచ్చిన చెక్స్ బౌన్స్ అయ్యాయని హేమ తెలిపారు.
Next Story