Mon Dec 23 2024 15:29:54 GMT+0000 (Coordinated Universal Time)
ఆరోపణలన్నిటిపై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టనున్న జీవిత రాజశేఖర్.. ఏం చెప్పబోతున్నారో..?
2017లో రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం గరుడవేగ. ఈ చిత్ర నిర్మాణంలో జీవితా రాజశేఖర్‌లతో పాటు
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవిత పై జోష్టర్ ఫిలిం సర్వీసెస్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..! రాజశేఖర్ త్వరలోనే జైలుకు వెళ్తారని ఆ సంస్థ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు శుక్రవారం వ్యాఖ్యలు చేశారు. జీవిత రాజశేఖర్ లు తమను మోసం చేశారని.. ఈ కేసులో నగరి కోర్టు జీవిత రాజశేఖర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిందని తెలిపారు. జోష్టర్ ఫిలిం సర్వీసెస్ నుంచి జీవితా రాజశేఖర్‌లు రూ.26 కోట్ల మేర అప్పు తీసుకుని ఎగ్గొట్టారని కోటేశ్వరరాజు ఆరోపించారు. గరుడ వేగ సినిమా కోసం జీవితా రాజశేఖర్‌లు అప్పు అడిగితే జోష్టర్ ఫిలిం సర్వీసెస్ తమ ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బు సర్దుబాటు చేసిందని తెలిపారు. కానీ జీవిత రాజశేఖర్ ఆ అప్పును తిరిగి చెల్లించలేదు. ఆస్తులను బినామీల పేర్లమీదికి మార్చి మోసం చేశారని ఆరోపించారు.
గరుడవేగ కోసం రూ.26 కోట్లు ?
2017లో రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం గరుడవేగ. ఈ చిత్ర నిర్మాణంలో జీవితా రాజశేఖర్‌లతో పాటు జ్యోస్టార్ సంస్థ కూడా భాగమైంది. ఈ సినిమా రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలవ్వడానికి కారణం అయింది. జ్యోస్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హేమ చెక్ బౌన్స్ కేసులో నగరి కోర్టుని ఆశ్రయించారు. గతంలో జీవితా రాజశేఖర్ తమకు రూ.26 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఎగగొట్టారని, ఆమె ఇచ్చిన చెక్స్ బౌన్స్ అయ్యాయని హేమ తెలిపారు. ఒకే ఆస్థిని జీవితా రాజశేఖర్ ఇద్దరికి విక్రయించారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో చెక్ బౌన్స్ కేసుని పరిశీలించిన నగరి న్యాయస్థానం జీవితకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు.
నిజాలన్నీ చెబుతాం
ఈ విషయంపై జీవితా రాజశేఖర్ స్పందించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, శనివారం ఆధారాలతో సహా శేఖర్ సినిమా ప్రెస్మీట్లో తాము మీడియా ముందు అసలు విషయాన్ని చెబుతామని జీవితా రాజశేఖర్ తెలిపారు. తమపై వచ్చిన ఆరోపణల్లో నిజంలేదని అన్నారు. శనివారం 'శేఖర్' సినిమా ప్రెస్ మీట్ ఉందని, ఆ ప్రెస్ మీట్ లో అన్ని వివరాలు చెబుతానని తెలిపారు. పూర్తి ఆధారాలు మీడియా ముందుకు తీసుకువస్తానని, అప్పటివరకు దీనిపై ఎవరూ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం శేఖర్. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story