Mon Dec 23 2024 06:37:00 GMT+0000 (Coordinated Universal Time)
స్టార్ హీరోకి సోదరిగా.. 35 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీకి జీవిత రాజశేఖర్ రీ ఎంట్రీ
ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ లైకాలో మరో రెండు సినిమాలకు..
ఒకానొకప్పుడు హీరోలు, హీరోయిన్లుగా సినీ ప్రపంచాన్ని ఏలిన సీనియర్ నటులు ఇప్పుడు పలు చిత్రాల్లో అమ్మ, నాన్న, అత్త, అక్క వంటి క్యారెక్టర్లతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీలు ఇస్తున్నారు. అలా ఇప్పుడు నటి జీవిత రాజశేఖర్ సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా ఆషా మాషీగా కాదు. స్టార్ హీరో రజనీకాంత్ కు సోదరిగా. తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి అలరించిన జీవిత.. రాజశేఖర్ తో వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తమిళ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ లైకాలో మరో రెండు సినిమాలకు ఆయన సైన్ చేశారు. ఈ రెండింటిలో ఒక సినిమాను రజనీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేస్తోంది. ధనుష్ ‘3’ మూవీతో దర్శకురాలిగా మారిన ఐశ్వర్య.. దాదాపు 7 ఏళ్ళ గ్యాప్ తీసుకోని తన కెరీర్ లో మూడో సినిమాని తెరకెక్కిస్తుంది. గత ఏడాది నవంబర్ నెలలో ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సినిమాలో హీరో రజనీకాంత్ అనుకుంటే పొరపాటే. ఆయన కేవలం అతిథిపాత్రలో కనిపిస్తారంతే.
మెయిన్ లీడ్ లో హీరోగా తమిళ హీరో విష్ణు విశాల్ కనిపించబోతున్నాడు. మరో తమిళ నటుడు విక్రాంత్ ప్రధాన పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాలోనే జీవిత రాజశేఖర్ రజనీకాంత్ సోదరిగా కీలక పాత్ర పోషించనున్నారు. స్పోర్ట్స్ అండ్ రిలీజియన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ లో జీవిత మార్చి 7 నుంచి పాల్గొననున్నారు. ఐశ్వర్యనే స్క్రీన్ ప్లే అందిస్తోన్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి.
Next Story